కాలుష్య కంపెనీల కోసం పర్యావరణాన్ని బలిపెడతారా?
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:39 PM
కాలుష్య కంపెనీల కోసం పర్యావరణాన్ని బలిపెడుతున్నారని పాలమూరు అధ్య యన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ యం.రాఘవాచారి బుధ వారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

- పాలమూరు అధ్యయన వేదిక
పాలమూరు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : కాలుష్య కంపెనీల కోసం పర్యావరణాన్ని బలిపెడుతున్నారని పాలమూరు అధ్య యన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ యం.రాఘవాచారి బుధ వారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ భూములను ప్రభుత్వం దురాక్రమించడాన్ని ఖండించాలని ప్ర జలకు పిలుపునిచ్చారు. 1973లో ఇందిరాగాంధీ ఆరు సూత్రా ల పథకంలోని రెండో అంశాన్ని అమలు పరుస్తూ, అంతర్జా తీయ స్థాయిని తట్టుకునే విధంగా 2,300 ఎకరాల భూమిని కేటాయించి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పేరుతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం దేశ నిర్మాణా నికి అందించిన సామాజిక, వైజ్ఞానిక శాస్త్రవేత్తలు అందిస్తున్న దోహదాన్ని మరిచి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ భూ ముల దురాక్రమణకు సిద్ధపడి అక్కడి పర్యావరణ, జీవా వరణ వ్యవస్థను బుల్‌డోజర్లతో ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విఽ ద్వంసాన్ని, భూ దురాక్రమణను మానుకుని హెచ్‌సీయూ భూ ములను వదిలేయాలనిడి మాండ్ చేశారు. ప్రజలు బీజేపీ, బీఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయి కాంగ్రెస్‌కు అధికారం అప్పగి స్తే అవే విధానాలు అమలు చేస్తే ఏమనాలని ప్రశ్నించారు. ఉ స్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్యం కోసం, హెచ్‌సీ యూలో పర్యావరణాన్ని ఆ యూనివర్సిటీ భూములను కాపాడ టానికి పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా ప్రజాస్వామిక వాదులు నిలబడాలని పిలుపునిచ్చారు.