Mahesh Kumar Goud: విపక్షాల అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి
ABN, Publish Date - Mar 12 , 2025 | 03:54 AM
ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎండగట్టి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో ముందుండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ నూతన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సూచించారు.
కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థులను సన్మానించిన మహే్‌షకుమార్ గౌడ్
కేసీఆర్‌కు వేతనాన్ని ఆపేయాలి: కాంగ్రెస్
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎండగట్టి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడంలో ముందుండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ నూతన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సూచించారు. మంగళవారం హైదర్‌గూడ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ నూతన ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, నెల్లికంటి సత్యంలు మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆయన ఘనంగా సన్మానించి మాట్లాడారు. మిత్రపక్షంగా సీపీఐకి సంపూర్ణ సహకారం అందించామని, ఇదే మైత్రి కొనసాగాలని ఆ పార్టీకి సూచించారు.
ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించడంలో కేసీఆర్ విఫలమయ్యారని, ఆయనకు చెల్లించే వేతనాన్ని నిలిపివేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ పక్ష నాయకులు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి అల్లం భాస్కర్, పీసీసీ ఎస్టీ సెల్ నాయకులు జగన్‌లాల్ తదితరులు శాసనసభలో స్పీకర్ ప్రసాదరావును కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ, మోదీకి కేసీఆర్ కోవర్టుగా పనిచేసున్నారని విప్ ఆదిశ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రె్‌సతోనే రాష్ట్రంలో గత పదేళ్లలో సాధ్యం కాని గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలు కాంగ్రెస్ హయాంలోనే భర్తీ కానున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గాంధీభవన్‌లో చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోనే ఉద్యోగాల భర్తీ సాధ్యమని చెప్పారు. అబద్ధాలు చెబుతూ వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవడంలో కేసీఆర్‌తో సరిపోయే వ్యక్తులెవరూ లేరని పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..
Updated Date - Mar 12 , 2025 | 03:54 AM