Mayor: మేయర్‌ సంచలన నిర్ణయం.. ఇక ఎన్నికల్లో పోటీ చేయను

ABN, Publish Date - Jan 29 , 2025 | 07:11 AM

త్వరలో జరిగే గ్రేటర్‌ ఎన్నికల్లో తాను తిరిగి కార్పొరేటర్‌గా పోటీ చేయడం లేదని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(GHMC Mayor Gadwal Vijayalakshmi) స్పష్టం చేశారు. ‘మేయర్‌గా, నగర ప్రథమ పౌరురాలిగా ఎంతో విజయవంతంగా పని చేశాననే సంతృప్తితో ఉన్నాను.

Mayor: మేయర్‌ సంచలన నిర్ణయం.. ఇక ఎన్నికల్లో పోటీ చేయను

హైదరాబాద్: త్వరలో జరిగే గ్రేటర్‌ ఎన్నికల్లో తాను తిరిగి కార్పొరేటర్‌గా పోటీ చేయడం లేదని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(GHMC Mayor Gadwal Vijayalakshmi) స్పష్టం చేశారు. ‘మేయర్‌గా, నగర ప్రథమ పౌరురాలిగా ఎంతో విజయవంతంగా పని చేశాననే సంతృప్తితో ఉన్నాను. అందుకే మరోసారి పోటీ చేయబోవడం లేదు.. కొత్త వారికి కూడా అవకాశాలు రావాలి కదా..’ అని అన్నారు. మంగళవారం ఉప్పల్‌ సర్కిల్‌ చిలుకానగర్‌ డివిజన్‌లో రూ.1.98 కోట్లతో నిర్మిస్తున్న వైకుంఠధామానికి డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి(Deputy Mayor Mothe Srilathareddy), స్థానిక కార్పొరేటర్‌ బన్నాల గీతాముదిరాజ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: TG NEWS: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


city1.2.jpg

ఫిబ్రవరి 11 తరువాతే అవిశ్వాసానికి అవకాశం ఉందని, ఆ తరువాతే ఆ విషయంపై స్పందిస్తానని పేర్కొన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే 98 మంది సభ్యుల మద్దతు అవసరమని, అంతమంది ఉంటే కలెక్టర్‌కు లేఖ ఇచ్చినా నెల, నెలన్నర రోజులు పడుతుందన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారిపై తాను తిరిగి ఆరోపణలు చేయబోనని బదులిచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేయనన్న మేయర్‌ ప్రకటన నేపథ్యంలో ఆమె రాజకీయ భవిష్యత్తుపై భిన్న ప్రచారాలు జరుగుతున్నాయి. నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీ లేదా ఏదైనా సంస్థకు చైర్మన్‌గా అవకాశం లభించవచ్చని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.


వార్తను కూడా చదవండి: CM Revanth Reddy : పిచ్చోడు.. తిక్కలోడు

ఈవార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై

ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

ఈవార్తను కూడా చదవండి: TG News: ఛీ ఛీ అనిపించుకోను


Read Latest Telangana News and National News

Updated Date - Jan 29 , 2025 | 07:11 AM