ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: వారి సరదా ఎంతటి ఘోరానికి దారి తీసింది..

ABN, Publish Date - Jan 11 , 2025 | 02:56 PM

Telangana: సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లిన ఆ యువకులను మృత్యువు బలితీసుకుంది. డ్యాంలో పడి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.

Kondapochamma sagar dam

సిద్దిపేట, జనవరి 11: వారంతా స్నేహితులు. సంక్రాంతి పండుగకు సెలవులు వచ్చేయడంతో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయాలని భావించారు. అందుకు వారు ఎంచుకున్న ప్లేస్ సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్. ఎంతో సరదాగా.. అక్కడా బాగా ఎంజాయ్ చేసేందుకు ఏడుగురు యువకులు తమ తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరారు. కానీ అదే వారికి చివరి చూపు అవుతుందని తల్లిదండ్రులు భావించలేదు. సరదాగా గడపడానికి వెళ్లిన వారి వెనకే మృత్యువు ఉందని గ్రహించలేకపోయారు యువకులు.. అనుకున్న విధంగా డ్యాం దగ్గరు చేరుకున్న ఆ ఏడుగురు యువకులు.. ఈత కొట్టాలని భావించారు. అంతా కలిసి డ్యాంలోకి దిగారు.. ఇంతలో ఏం జరిగిందో తెలియదు ఒకరి ఒకరి తర్వాత డ్యాంలో పడి గల్లంతయ్యారు. వీరు మునిగిపోతున్నట్లు గుర్తించిన గత ఈతగాళ్లు వెంటనే రంగంలోకి దిగారు. కానీ అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. సిద్ధిపేట జిల్లాలో (Siddepet district) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం ఈతకు వెళ్లిన ఆ యువకులకు విషాదమే మిగిలింది.


జిల్లాలోని మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ ముషీరాబాద్‌ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. ముందుగా యువకులు గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం ఏడుగురు యువకుడు డ్యాంలో పడిపోగా.. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారికి గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్.. కోర్టు కీలక ఉత్తర్వులు


మృతులు ధనుష్ (20), లోహిత్ (లక్కీ) (17), చీకట్ల దినేశ్వెర్ (17), సాహిల్ (19), జతిన్ (17)గా గుర్తించారు. అలాగే కొమరి మృగంక్ (17), ఎండీ ఇబ్రాహీం(20) సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వీరి మృతి విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదా వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల శోకం వర్ణణాతీతం. యువకుల మృతి వార్త తెలిసి ముషీరాబాద్‌లోనూ విషాదఛాయలు అలముకున్నాయి.


సీఎం రేవంత్ ఆరా...

మరోవైపు కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.గల్లంతైన వారికోసం గజ ఈత గాళ్లను రప్పించాలని ఆదేశిస్తూ.. జిల్లా అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

TG News: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్

CM Revanth: సీఎం రేవంత్ జిల్లాల బాట.. వాటిపై ప్రత్యేక దృష్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 11 , 2025 | 04:40 PM