ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Siddepet: నలుగురి మృతదేహాలు లభ్యం.. పరిస్థితి ఎలా ఉందంటే..

ABN, Publish Date - Jan 11 , 2025 | 07:17 PM

తెలంగాణ: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో గల్లంతయిన ఐదుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. గల్లంతయిన వారిలో ఇప్పటివరకూ దినేశ్వర్, జతీన్, ధనుష్, సాహిల్ మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు.

Kondapochamma Sagar Dam

సిద్దిపేట: మార్కుక్ (Markuk) మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాం (Kondapochamma Sagar Dam)లో గల్లంతయిన ఐదుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. గల్లంతయిన వారిలో ఇప్పటివరకూ దినేశ్వర్, జతీన్, ధనుష్, సాహిల్ మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు. మరో యువకుడు లోహిత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఏడుగురు యువకులు కొండపోచమ్మ ప్రాజెక్టులో ఈత కొట్టేందుకు సరదాగా వెళ్లారు. అయితే కాసేపటికే వారంతా నీళ్లల్లో మునిగిపోయారు. ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడగా.. ఐదుగురు మాత్రం గల్లంతయ్యారు.


సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. యువకుల గల్లంతైన విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులు దగ్గరండి మరీ పరిస్థితిని పర్యవేక్షించాలని, తగిన సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో గత ఈతగాళ్లను పోలీసులు రంగంలోకి దింగారు. నలుగురి మృతదేహాలు లభించగా.. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


మంత్రి ఆదేశం..

యువకులు గల్లంతుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరితో మంత్రి మాట్లాడారు. అధికారులు వేగంగా సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. ప్రాజెక్టుల వద్దకి ఈతకి వెళ్లినప్పుడు యువకులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు.


కేటీఆర్ దిగ్భ్రాంతి..

మరోవైపు ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ప్రమాదవశాత్తూ ఐదుగురు గల్లంతు కావడం తనను తీవ్రంగా కలిచివేసినట్లు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. యువకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి అకాల మరణం ఆ కుటుంబాలకు తీరని లోటని అన్నారు. తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jan 11 , 2025 | 10:15 PM