Tummala: నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి

ABN, Publish Date - Mar 29 , 2025 | 05:01 AM

వర్షాకాలం సీజన్‌కు అన్ని పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Tummala: నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
  • నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి: తుమ్మల

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యో తి): వర్షాకాలం సీజన్‌కు అన్ని పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సచివాలయంలో శుక్రవారం విత్తనాల లభ్యత, సరఫరాపై వ్యవసాయాధికారులు, విత్తన కంపెనీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయాధికారులు వారి పరిధిలో ఉన్న విత్తన సంస్థలను తరుచూ పర్యవేక్షించి, రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా చూడాలని, అలసత్వం ప్రదర్శిేస్త కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఈ మేరకు రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే సచివాలయంలో జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ.. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా సేంద్రియ పద్ధతిలో పసుపు పంట పండించేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Updated Date - Mar 29 , 2025 | 05:01 AM