ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: నుమాయిష్‌ ద్వారా వచ్చే ఆదాయంతో విద్యాసంస్థల సంఖ్యను పెంచాలి

ABN, Publish Date - Jan 04 , 2025 | 08:17 AM

నుమాయిష్‌ ద్వారా వచ్చే ఆదాయంతో నిర్వహిస్తున్న విద్యాసంస్థల సంఖ్యను మరింత పెంచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) ఎగ్జిబిషన్‌ సొసైటీకి సూచించారు.

హైదరాబాద్: నుమాయిష్‌ ద్వారా వచ్చే ఆదాయంతో నిర్వహిస్తున్న విద్యాసంస్థల సంఖ్యను మరింత పెంచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) ఎగ్జిబిషన్‌ సొసైటీకి సూచించారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన నుమాయిష్ ను మంత్రి డి.శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీ హనుమంతరావు (వీహెచ్‌)తో కలిసి బెలున్లు ఎగురవేసి ప్రారంభించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య


అనంతరం పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇరవై విద్యాసంస్థలు కొనసాగుతుండగా వాటిని 30వరకు పెంచాలని కోరారు. అందుకు అవసరమయ్యే అనుమతులు, ఇతరాత్ర సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎగ్జిబిషన్‌ స్థలం లీజు విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడతానన్నారు. ఐటీ మంత్రి డి.శ్రీధర్‌బాబు(IT Minister D. Sridhar Babu) మాట్లాడుతూ,


ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాలను వచ్చే విద్యా సంవత్పరం నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీగా మార్చి అడ్మిషన్లు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్‌, కార్యదర్శి బి.సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2025 | 08:17 AM