ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manda Krishna: 7న ఎమ్మార్పీఎస్‌ ‘దండోరా’

ABN, Publish Date - Jan 10 , 2025 | 05:01 AM

రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తక్షణమే అమలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్‌ ఫిబ్రవరి 7న వెయ్యి గొంతులు లక్ష డప్పులతో దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శన చేపట్టనుంది.

  • ఎస్సీ వర్గీకరణ అమలే లక్ష్యం : మందకృష్ణ మాదిగ

తార్నాక, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తక్షణమే అమలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్‌ ఫిబ్రవరి 7న వెయ్యి గొంతులు లక్ష డప్పులతో దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శన చేపట్టనుంది. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ సాంస్కృతిక మహా ప్రదర్శనకు మద్దతుగా ఓయూలో విద్యార్థి సంఘాల నాయకులతో గురువారం ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని అన్నారు. ఇప్పటీకీ కొందరు మాలలు వర్గీకరణకు అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అంతిమ పోరాటంగా మాదిగల అస్తిత్వమైన డప్పుతో ఫిబ్రవరి 7న మాదిగల గుండె చప్పుడు వినిపిస్తామని చెప్పారు. ఈ దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - Jan 10 , 2025 | 05:01 AM