Share News

Munuru Kapu: మున్నూరు కాపుల మహాధర్నా

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:33 AM

కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మున్నూరు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మున్నూరు కాపులు మహాధర్నా నిర్వహించారు.

Munuru Kapu: మున్నూరు కాపుల మహాధర్నా

  • ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని డిమాండ్‌

  • ఆత్మీయ సమావేశంలోనూ నిరసన

కవాడిగూడ, ఖైరతాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మున్నూరు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మున్నూరు కాపులు మహాధర్నా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మున్నూరు కాపు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రైతులు తీసుకువచ్చిన వరిధాన్యం, మొక్కజొన్న కర్రలు ఇతర వ్యవసాయ పనిముట్లకు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర కన్వీనర్‌ ఉగ్గే శ్రీనివాస్‌ పటేల్‌ పూజలు చేసి ధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. మున్నూరు కాపులకు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ. 5 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని కోరారు. ఈ మహాధర్నాకు ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న హాజరై మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన కుల సర్వేలో మున్నూరు కాపులను తక్కువ చేసి చూపించడంపై ఆ కులసంఘం భగ్గుమంది.


ఆదివారం పీవీ నర్సింహారావు మార్గంలోని జలవిహార్‌లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం, మున్నూరు కాపు గర్జన కార్యాచరణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మున్నూరు కాపుల దశ, దిశ ఆత్మీయ సమ్మేళనం పేరిట జరిగిన సమావేశంలో వక్తలు ప్రభుత్వం తీరును విమర్శించారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, వద్దిరాజు రామచంద్ర, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అఽధ్యక్షుడు డాక్టర్‌ కొండా దేవయ్య పటేల్‌, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

For More AP News and Telugu News

Updated Date - Apr 14 , 2025 | 04:33 AM