Manda Jagannadham: మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత
ABN , Publish Date - Jan 12 , 2025 | 08:43 PM
Manda Jagannadham: నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం తుది శ్వాస విడిచారు.
హైదరాబాద్, జనవరి 12: మాజీ ఎంపీ డాక్టర్ మంద జగన్నాథం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు . గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతోన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో మందా జగన్నాథం చేరారు.
అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు.. 1996, 1999, 2004, 2009 ఆయన ఎంపీగా విజయం సాధించారు. అయితే 2009లో ఆయన టీడీపీ వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఆయన ఎంపీగా అదే స్థానం నుంచి గెలుపొందారు.
ఇక 2014లో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు.. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో.. ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి.. నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. అదే సమయంలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగడంతో.. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ స్థానం నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు.
ఈ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో మందా జగన్నాథం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. కానీ నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అందులోభాగంగా.. 2018లో న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. దీంతో ఆయనకు కేబినెట్ హోదా సైతం కేటాయించింది. ఈ పదవి కాలం పూర్తయిన అనంతరం ఆయనకు ఈ పదవిని మరోసారి రెన్యూవల్ సైతం చేసింది.
Also Read: భోగి పండగ రోజు ఇలా చేస్తే.. అంతా అదృష్టమే.. ఐశ్వర్యమే
Also Read: వేరే వారికి పుట్టిన బిడ్డ.. తన బిడ్డగా చెప్పుకొంటుంది
ఇక 2023 ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్
Also Read: ప్రయాణికులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే
గతేడాది డిసెంబర్ చివరి వారంలో మంద జగన్నాథం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోన్నారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించారు. ఆయన్ని నిమ్స్‌లోని ఆర్‌ఐసీయూ విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నాటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.
Also Read: నారా వారి పల్లెకు సీఎం చంద్రబాబు.. అయితే
ఇక ఆయన కుమార్తె మంద పల్లవి.. ఎంఎస్ చేశారు. అనంతరం ప్రభుత్వ వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడు మంద శ్రీనాథ్. బీటెక్ మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసి.. సోషల్ వర్కర్‌గా కొనసాగుతోన్నారు. చిన్న కుమారుడు మంద విశ్వనాథ్.. ఎంబీబీఎస్ చదవి.. వైద్యుడిగా కొనసాగుతోన్నారు.
For Telangana News And Telugu News