ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నల్లగొండ ఎక్స్‌రోడ్‌ వంతెన వ్యయం రూ. 97 కోట్లు పెంపు

ABN, Publish Date - Jan 09 , 2025 | 10:49 AM

నల్లగొండ ఎక్స్‌రోడ్‌(Nalgonda Xroad) వంతెన నిర్మాణ వ్యయం పెరిగింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్‌కు రూ.97 కోట్లు అదనంగా ఖర్చు కానుంది.

హైదరాబాద్‌ సిటీ: నల్లగొండ ఎక్స్‌రోడ్‌(Nalgonda Xroad) వంతెన నిర్మాణ వ్యయం పెరిగింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్‌కు రూ.97 కోట్లు అదనంగా ఖర్చు కానుంది. రూ. 523 కోట్ల నుంచి రూ.620 కోట్లకు పెంచుతూ జీహెచ్‌ఎంసీ పెంచిన సవరణ ప్రతిపాదనలకు పాలనాపరమైన అనుమతులిస్తూ పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వార్తను కూడా చదవండి: Formula E car case: ఏసీబీ విచారణకు కేటీఆర్.. ఏం జరుగనుంది.. తీవ్ర ఉత్కంఠ


సమగ్ర కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా చంచల్‌గూడ(Chanchalguda) ప్రభుత్వ ముద్రణాలయం నుంచి చంచల్‌గూడ, సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌, ఒవైసీ జంక్షన్ల మీదుగా 3.38 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా స్టీల్‌ వంతెన నిర్మాణ పనులు 2021 చివర్లో మొదలయ్యాయి. 2023 జూన్‌లో పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ సాగుతున్నాయి. వంతనకు రూ.523 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఆస్తుల సేకరణ, భూగర్భంలోని తాగునీరు, డ్రైనేజీ పైపులైన్లతోపాటు విద్యుత్‌ స్తంభాల మార్పిడి తదితరాలతో నిర్మాణం వ్యయం పెరిగింది.


స్టీల్‌, సిమెంట్‌ తదితర ధరలూ పెరిగిన నేపథ్యంలో అంచనా వ్యయం అధికమైందని సవరణ ప్రతిపాదనలను పురపాలక శాఖకు పంపారు. రూ.620 కోట్లకు పెంచుతూ పంపిన ప్రతిపాదనలకు సమగ్ర పరిశీలన అనంతరం ఆమోదిస్తున్నట్టు పురపాలక శాఖ పేర్కొంది. మే నెలాఖరు వరకు వంతెన అందుబాటులోకి వస్తుందని ఇంజనీరింగ్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇందిరాపార్కు- వీఎస్‏టీ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ వ్యయమూ రూ.139 కోట్లు పెరిగింది. రూ.426 కోట్లతో అంచనా వేయగా.. రూ.565 కోట్లకు పెంచారు.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 10:49 AM