‘డబుల్’ ఇళ్ల మరమ్మతులకు రూ.2.55కోట్లు
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:02 AM
భువనగిరిలోని డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 2.55 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను కలెక్టర్ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆయన డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను మంగళవారం పరిశీలించారు.

ధనికులతో సమానంగా పేదలకు సన్నబియ్యం అన్నం
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
భువనగిరి టౌన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): భువనగిరిలోని డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 2.55 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను కలెక్టర్ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆయన డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను మంగళవారం పరిశీలించారు. పదేళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో ధ్వంసమైన కిటికీలు, తలుపులు తదితర మరమ్మతులు చేపట్టాలని, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అవసరమైన పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతిపాదిత పనులు పూర్తయిన వెంటనే 444 మంది లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామన్నారు. అనంతరం స్థానిక తారకరామనగర్‌లోని జి.పుష్పలత ఇంట్లో సన్నబియ్యం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ధనికులు తినే సన్నబియ్యం భోజనం సీఎం రేవంత్‌రెడ్డి కృషితో నేడు పేదలు కూడా తింటున్నారన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, భువనగిరి పట్టణాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను జిల్లాలో పకడ్భందీగా అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుధీర్, పీఆర్‌డీఈ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ డీఎం హరికృష్ణ, జడ్పీ సీఈవో శోభారాణి, మునిసిపల్ కమిషనర్ జి.లింగస్వామి, తహసీల్దార్ అంజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవేజ్ చిస్తి, మునిసిపల్ మాజీ చైర్మన్లు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్ పాల్గొన్నారు.