Share News

నీళ్లు, నియామకాల్లో మోసం చేసిన కాంగ్రెస్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:44 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ నీళ్లు, నియామకాల విషయంలో ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సయాద వ్‌ ఆరోపించారు. గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిం చి లక్షల ఎకరాలకు సాగునీరు అం దించి ఎంతో మంది రైతులను ఆదుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరాన్ని పండబెట్టి రైతుల భూములను ఎండబెట్టారని విమర్శించారు.

నీళ్లు, నియామకాల్లో మోసం చేసిన కాంగ్రెస్‌

బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌

యాదగిరిగుట్ట రూరల్‌, ఏప్రిల్‌ 14, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ నీళ్లు, నియామకాల విషయంలో ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సయాద వ్‌ ఆరోపించారు. గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిం చి లక్షల ఎకరాలకు సాగునీరు అం దించి ఎంతో మంది రైతులను ఆదుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరాన్ని పండబెట్టి రైతుల భూములను ఎండబెట్టారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన నోటిఫికేష్లతోనే ఉద్యోగాలు భర్తీ చేశారే తప్ప, కొత్తగా ఇచ్చిందేమీలేదని, నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. విద్యార్థులకు రూ.5లక్షల రుణాలు ఇస్తానని, విద్యార్థినులకు ద్విచక్రవాహనాలు ఇస్తానని ఇప్పటి వరకు అందజేయలేదన్నారు. వీటన్నింటినీ ప్రశ్నించేందుకే వరంగల్‌లో రజతోత్సవ సభకు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర నేత తుంగబాలు మాట్లాడుతూ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు రాయగిరి నుంచి గుట్ట స్వామి వారి పాదాల వరకు వెయ్యి మంది విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించామన్నారు. సమావేశంలో బీఆర్‌ఎ్‌సవీ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, బొగ్గు శివకుమార్‌, రమే్‌షయాదవ్‌, భాను, మున్నా, ఎండి.అజ్జు, మన్నె ప్రభాకర్‌, మహేష్‌, ఐలేష్‌ పాల్గొన్నారు.

బహిరంగ సభ విజయవంతం చేయాలి

భువనగిరి రూరల్‌, యాదగిరిగుట్ట రూరల్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.

సోమవారం బీఆర్‌ఎ్‌సవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌తో కలిసి భువనగిరి శివారులోని రాయగిరి నుంచి వడాయిగూడెం మీదుగా యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నార్మాక్స్‌ డైరెక్టర్‌ కస్తూరి పాండు, నాయకులు ఒగ్గు శివకుమార్‌, పెంట నితీష్‌, మట్ట ధనుంజయ, కల్లూరి రామచంద్రారెడ్డి, ప్రవీణ్‌ రెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, కర్రె వెంకటయ్య, కసావు శ్రీనివా్‌సగౌడ్‌, మిట్ట వెంకటయ్యగౌడ్‌, పాపట్ల నరహరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:44 AM