Share News

కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం రశీదు

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:00 AM

రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తేగానే తూకంవేసి రైతులకు అక్కడే బిల్లు రశీదు ఇస్తారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు. మంగళవారం మండలంలోని మాసాయిపేట గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం రశీదు

మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తేగానే తూకంవేసి రైతులకు అక్కడే బిల్లు రశీదు ఇస్తారని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు. మంగళవారం మండలంలోని మాసాయిపేట గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే తరుగుపేరుతో కొంత తగ్గించేదని, అకాల వర్షం వస్తే కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోతే వాటికి తక్కువ ధర చెల్లించేదన్నారు. కానీ ప్రజా పాలనలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెస్తే వెంటనే వాటిని తూకంవేసి రశీదు ఇవ్వడంతో ఒకవేళ అకాల వర్షం వచ్చి తడిసిపోయినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రశీదు పొందిన రైతులకు కేవలం మూడు రోజుల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమవుతాయన్నారు. ప్రతిపక్షాలు రైతులతో రాజకీయం చేసి వారిని పక్కదారి పట్టిస్తున్నారని, రైతులతో రాజకీయం వద్దన్నారు. ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి రూ.700కోట్లతో గంధమల్ల రిజర్వాయర్‌ పనులు త్వరలో మొదలు పెడతామని, దీంతో ఎనిమిది మండలాల్లో లక్షన్నర ఎకరాలకు సాగునీటి సమస్య పూర్తిగా తీరుతుందన్నారు. ఎన్నికల సమయంలోనే పార్టీ జెండాలు మోయాలని, తర్వాత అంతా కలిసి గ్రామాల అఽభివృద్ధికి పాటుపాడాలని కోరారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ చైర్మన్‌ ఐనాల చైతన్యమహేందర్‌రెడ్డి, గుట్ట పీఏసీఎన్‌ చైర్మన్‌ ఇమ్మడి రాంరెడ్డి, తహసీల్దార్‌ దేశ్యనాయక్‌, ఏవో సుధారాణి, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, నాయకులు కల్లెం జహంగీర్‌గౌడ్‌, యాకూబ్‌, మాజీ చైర్మన్‌ ఒంటేరు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

సన్నబియ్యం పథకం చరిత్రాత్మక నిర్ణయం

బొమ్మలరామారం: సన్నబియ్యం పంపిణీ పథకం చరిత్రాత్మక నిర్ణయమని బీర్ల అయిలయ్య అన్నారు. మంగళవారం బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామంలో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ దే శంలో ఏరాష్ట్రంలో కూడా లేదని,కేవలం తెలంగాణలో కాంగ్రె్‌సతోనే సాధ్యమైందన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబోతున్నామని తెలిపారు. అనంతరం గ్రామంలో మంజూరు చేసిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. జైబాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌లో మాట్లాడు తూ రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భువనగిరి మా ర్కెట్‌ వైస్‌ చైర్మన్‌ రాజేష్‌ పైలెట్‌, నాయకులు సుధాకర్‌, చీర సత్యనారాయణ, జంగారెడ్డి, శ్రీహరినాయక్‌, గట్టయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 01:00 AM