MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ABN, Publish Date - Jan 12 , 2025 | 09:52 PM
MLC K Kavitha: రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు.
కామారెడ్డి, జనవరి 12: రైతుల కోసం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే కానీ.. చేతల ప్రభుత్వం కాదని ఆమె మండిపడ్డారు. ఆదివారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించారని.. కానీ రూ. 12 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. మహిళలు, ఆటో డ్రైవర్లు, కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ ఈ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామని ప్రకటించిన.. రూ. 12 వేలు వెంటనే చెల్లించాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంలో ఒక్క ప్రాజెక్ట్‌లో సైతం తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని గుర్తు చేశారు. గురుకులాల్లో తిండి సరిగ్గా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతోన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెందిన పలు గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మరణిస్తున్నారని.. అయినా ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.
రైతు భరోసా సాయం విషయంలో మాట మార్చిన కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని గుర్తు చేశారు. అలాంటి పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు.
Also Read: మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత
Also Read: భోగి పండగ రోజు ఇలా చేస్తే.. అంతా అదృష్టమే.. ఐశ్వర్యమే
Also Read: వేరే వారికి పుట్టిన బిడ్డ.. తన బిడ్డగా చెప్పుకొంటుంది
కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. పది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బాన్సువాడ నియోజకవర్గానికి ఏడాదికి రూ. వెయ్యి కోట్ల చొప్పున కేసిఆర్ రూ. పది వేల కోట్లు ఇచ్చారని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏడాదికి రూ.1000 కోట్లు అయినా పోచారం తీసుకురాగలుగుతారా ? అని సందేహం వ్యక్తంచేశారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్
Also Read: ప్రయాణికులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే
Also Read: నారా వారి పల్లెకు సీఎం చంద్రబాబు.. అయితే
ప్రజలకు పనికి రాని పార్టీలోకి మారుడు ఎందుకు? అంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆమె బల్లగుద్ది ప్రశ్నించారు. కొంతమంది నాయకులు పార్టీ మారినా... ప్రజలు, కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ తో ఉన్నారని స్పష్టం చేశారు. బాన్సువాడతో పాటు తెలంగాణ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగరేద్దామంటూ బీఆర్ఎస్ పార్టీ కేడర్‌కు కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు.
For Telangana News And Telugu News
Updated Date - Jan 12 , 2025 | 09:54 PM