ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Phone tapping: ఫోన్‌ట్యాపింగ్‌పై సమాచారం ఇప్పించండి

ABN, Publish Date - Mar 08 , 2025 | 03:51 AM

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌, ఇతర అక్రమాలపై వివరాలు ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

  • సమాచార కమిషనర్లు లేక హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌, ఇతర అక్రమాలపై వివరాలు ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సమాచార కమిషనర్లు లేకపోవడంతో మరో మార్గం లేక హైకోర్టును ఆశ్రయించినట్టు ఫర్హాత్‌ ఇబ్రహీం అనే సామాజిక కార్యకర్త తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో తనకు బెదిరింపులు రావడం, ఫోన్‌ ట్యాపింగ్‌ జరగడంతో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బదిలీ చేసిందని తెలిపారు.


దానిపై తీసుకున్న చర్యలపై వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినప్పటికీ స్పందన లేదని పేర్కొన్నారు. అందువల్ల పూర్తిసమాచారం ఇచ్చే ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 21కి వాయిదావేసింది.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 03:53 AM