రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:51 AM
చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై జరిగిన దాడికి సంబంధించిన కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు.

మొయినాబాద్ రూరల్, ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై జరిగిన దాడికి సంబంధించిన కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరింది. ఖమ్మం జిల్లాకు చెందిన రాధాదేవి, రాజ్యలక్ష్మి, ముఖాంబిక, ఏపీలోని విశాఖపట్నంకు చెందిన జగదీశ్‌ను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచామని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ప్రకటించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.