ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: సంక్రాంతి నుంచి సంక్షేమరాజ్యం

ABN, Publish Date - Jan 12 , 2025 | 04:06 AM

రాష్ట్రంలో సంక్రాంతి నుంచి సంక్షేమరాజ్యం రాబోతోందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

  • 26 నుంచి సంక్షేమ పథకాలకు శ్రీకారం

  • అర్హులకు ఎన్ని లక్షల తెల్లకార్డులైనా ఇస్తాం

  • భూభారతితో రైతు భూముల సర్వే యోచన

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

ఖమ్మం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్రాంతి నుంచి సంక్షేమరాజ్యం రాబోతోందని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం నుంచి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడతామన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులకు జనవరి 26నుంచి పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు ఎన్ని లక్షల తెల్లకార్డులైనా ఇస్తామని తెలిపారు. రైతుభరోసా కింద రూ.12వేలు 26 నుంచే ఇవ్వబోతున్నామని తెలిపారు. గ్రామసభల్లోనే కొండలు, గుట్టలు, సాగుచేయని భూములు, రియల్‌ఎస్టేట్‌గా మారిన భూములను గుర్తించి తొలగిస్తామని స్పష్టం చేశా రు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా 26 నుంచే అమలు చేయబోతున్నాట్లు తెలిపారు.


భూముల రీసర్వే యోచనలో ప్రభుత్వం

రాష్ట్రంలో భూభారతి చట్టం అమలు కోసం 15వ తేదీ నుంచి 28లోగా విధి, విధానాలను రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. అలాగే భూభారతి కింద రాష్ట్రంలో భూములన్నింటినీ రీసర్వే చేసే ఆలోచనను పరిశీలిస్తున్నామన్నారు. తద్వారా భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ‘‘లొట్టపీసు కేసు.. లొట్టపీసు ముఖ్యమంత్రి’’ అంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందించారు. ఆయన మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దీనికి చట్టం, ప్రజలే సమాధానం చెబుతారన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 04:07 AM