Share News

సంప్రదాయ విత్తనాలతో ఆరోగ్యకర ఉత్పత్తులు

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:53 AM

దేశీయ, సంప్రదాయ విత్తన సంపదను పరిరక్షించుకోవాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుంకేట అన్వే్‌షరెడ్డి అన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

సంప్రదాయ విత్తనాలతో ఆరోగ్యకర ఉత్పత్తులు

  • రసాయనాల వినియోగంతో ఆహారోత్పత్తులు విషతుల్యం

  • నకిలీ విత్తనాలు, ఎరువులతోనే వ్యవసాయ సంక్షోభం

  • రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుంకేట అన్వేష్‌ రెడ్డి

  • అన్మా్‌సపల్లిలో అట్టహాసంగా ప్రారంభమైన విత్తన పండగ

కడ్తాల్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): దేశీయ, సంప్రదాయ విత్తన సంపదను పరిరక్షించుకోవాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుంకేట అన్వే్‌షరెడ్డి అన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడికి విత్తనాల ఎంపిక కీలకమన్నారు. కడ్తాల్‌ మండలం అన్మా్‌సపల్లి సమీపంలోని ‘ది ఎర్త్‌ సెంటర్‌’లో శుక్రవారం తెలంగాణ తొలి విత్తనాల పండగ అట్టహాసంగా ప్రారంభమైంది. దేశీయ సంప్రదాయ విత్తనాల వైభవాన్ని చాటి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌(సీజీఆర్‌) సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమానికి కేరళ, తమిళనాడు, ఒడిసా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, విత్తన నిపుణులు, పర్యావరణ వేత్తలు, దేశీయ సంప్రదాయ ధాన్యాల ఉత్పత్తిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


దేశీయ సంప్రదాయ విత్తనాలు, సేంద్రియ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలకు సంబంధించి విత్తన పండగలో 50 ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. పంటల అధిక దిగుబడి, ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మోతాదుకు మించి రసాయన ఎరువులు వినియోగించడం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యంగా మారుతున్నాయని అన్వే్‌షరెడ్డి అన్నారు. తద్వారా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి సాధ్యమని చెప్పారు. పూర్వం 2 లక్షల వంగడాలు ఉండేవని, కాలక్రమేణా అవన్నీ అంతరించిపోయి.. వరి, గోధుమ ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. వ్యవసాయంలో సంక్షోభానికి నకిలీ విత్తనాలు, ఎరువులే కారణమన్నారు. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం, విత్తనాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకుంటాయని చెప్పారు.

Updated Date - Apr 05 , 2025 | 04:53 AM