Share News

కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:18 PM

ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వాహకులు పక డ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని మోడల్‌ డిగ్రీ కళాశాలలో జన్నారం, దండే పల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల కేంద్రం నిర్వాహకులకు అదే విదంగా సంభందిత శాఖల అదికారుల సమక్షంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ మోతీలాల్‌

జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

లక్షెట్టిపేట, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వాహకులు పక డ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని మోడల్‌ డిగ్రీ కళాశాలలో జన్నారం, దండే పల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల కేంద్రం నిర్వాహకులకు అదే విదంగా సంభందిత శాఖల అదికారుల సమక్షంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడు తూ రైతులు యాసంగిలో సాగు చేసిన వరిధాన్యంను సన్నరకం దొడ్డు రకం వేరు వేరుగా కొనుగోలు చేయాలని సూచించారు. ఏగ్రేడ్‌ ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర రూ.2320 అదే విధంగా సాధారణ రకం ధాన్యానికి రూ.2300 నిర్ణయించారు. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో మంచినీటి సౌకర్యంతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. అంతే కాకుం డా తూకం వేసేందుకు ఖాంటా బాట్లు, మాయిశ్చర్‌ మిషన్‌, ప్యాడీ మీ టర్స్‌, డిజిటల్‌ మెట్రోమీటర్స్‌, గన్నీ సంచులు అందుబాటులో ఉంచుకో వాలని సూచించారు. అకాల వర్షలు సంభవించే అవకాశం ఉంటుందని కేంద్రంలో టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని కనీసం ఒ క్కో కేంద్రంలో 25టార్పాలిన్‌ కవర్లు ముందుగానే ఉంచుకునే విధంగా జా గ్రత్త పడాలన్నారు. కేంద్రాలకు ఇచ్చిన గన్ని సంచుల వివరాలు ఎప్ప టి కప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలన్నారు. రైతులకు కేంద్రాల వద్ద ఏలాంటి ఇబ్బంది తలెత్తకుండా కేంద్రాల్లో ఏలాంటి అవకతవకలు రాకుం డా జాగ్రత్త పడాలన్నారు. డీసీఎస్‌వో బ్రహ్మారావు, డీఆర్‌డీవో కిషన్‌, డీసీ ఎస్‌ఎం శ్రీకల, లక్షెట్టిపేట తహాసీల్దార్‌ దిలీప్‌కుమార్‌తో పాటు కేంద్రం నిర్వహకులు, రవాణ, మార్కెటింగ్‌, సెర్ఫ్‌, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

ఫవివిధ పనుల నిమిత్తం తహసీల్దార్‌ కార్యాలయాలకు వచ్చే ప్రజల దాహర్తి తీర్చడానికే కార్యాలయాల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. మంగళవారం పట ్టణంలోని తహాసీల్దార్‌ కార్యాలయం వద్ద ఎమ్మార్వో దిలీప్‌ కుమార్‌ ఏర్పా టు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పట్టణ వ్యా పారి చింతల శ్రీనివాస్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:18 PM