ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajanna Sircilla: ‘పరీక్షా పే చర్చ’లో తెలంగాణ విద్యార్థి సాయితేజ

ABN, Publish Date - Jan 28 , 2025 | 03:35 AM

పరీక్షల కాలంలో విద్యార్థుల్లో ఉండే సందేహాలు, భయాలను తొలగించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో నిర్వహించే ‘ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ’లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి పాల్గొన్నారు.

సిరిసిల్ల, జనవరి 27(ఆంధ్రజ్యోతి): పరీక్షల కాలంలో విద్యార్థుల్లో ఉండే సందేహాలు, భయాలను తొలగించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో నిర్వహించే ‘ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ’లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి పాల్గొన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కోనారావుపేట మండలం సుద్దాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న అలువాల సాయితేజ పాల్గొన్నారు.


పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురై అన్నం తినక, భయాందోళనలకు గురవుతున్నారని, దీనికి పరిష్కారం ఏమిటని ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీని సాయితేజ అడిగారు. అందుకు ఆయన ‘పరీక్షల సమయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉండాలి. ఆ సమయంలో పిల్లలు ఉలా ఉంటున్నారో గమనించాలి. దానికి అనుగుణంగా పిల్లలను ప్రోత్సహించి ధైర్యాన్ని ఇవ్వాలి’ అని బదులిచ్చారు.

Updated Date - Jan 28 , 2025 | 03:36 AM