Sri Rama Navami: శ్రీరామ నవమి శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు

ABN, Publish Date - Apr 05 , 2025 | 07:21 AM

శ్రీరామ నవమి శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వంచుకోవాలన్నారు. పిక్‌ పాకెటింగ్‌, చైన్‌ స్నాచింగ్‌లు జరగకుండా మఫ్టీలో సిబ్బందిని ఉంచాలన్నారు.

Sri Rama Navami: శ్రీరామ నవమి శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు

- శ్రీరామ నవమి శోభాయాత్రకు ఏర్పాట్లు

- సిబ్బందితో సీపీ సీవీ ఆనంద్‌ వీడియో కాన్ఫరెన్స్‌

- మద్యం అమ్మకాలు బంద్‌: రాచకొండ సీపీ

హైదరాబాద్‌ సిటీ: శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం జరిగే శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(City Police Commissioner CV Anand) వెల్లడించారు. ఈ మేరకు భద్రత, బందోబస్తుపై వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఉత్సవ సమితి, ఇతర శాఖల అధికారులతో శోభాయాత్ర విషయమై చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం


చిన్న ఊరేగింపులు అనుసంధానం అయ్యే కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. మతపరమైన ప్రదేశాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలలో అదనపు బలగాలు మోహరించాలని అన్నారు. పిక్‌ పాకెటింగ్‌, చైన్‌ స్నాచింగ్‌లు జరగకుండా మఫ్టీలో సిబ్బందిని ఉంచాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీ ఎస్‌. చైతన్య కుమార్‌, ఐటీ సెల్‌ డీసీపీ పుష్ప, జోనల్‌ డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.


రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో..

నవమి భద్రతా ఏర్పాట్లలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషనరేట్‌ పరిధిలోని డీసీపీలు ఏసీపీలతో రాచకొండ సీపీ సుధీర్‌ బాబు(Rachakonda CP Sudheer Babu) శుక్రవారం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. పీస్‌ కమిటీ సభ్యుల సహకారంతో వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని కల్లు, మద్యం దుకాణాలు బంద్‌ చేయాలని సీపీ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు, క్లబ్‌లలోనూ మద్యం అమ్మకాలు నిషేధించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చెడగొట్టు వానకు రైతు విలవిల!

ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ

రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 05 , 2025 | 07:23 AM