ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భాగ్యనగరీ ఊపిరి పీల్చుకో!

ABN, Publish Date - Jan 16 , 2025 | 04:09 AM

సంక్రాంతి పండగ వచ్చిందంటే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం సగానికి పైగా ఖాళీ అవుతుంది. పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారితో రోడ్లలో ట్రాఫిక్‌ కనిపించదు.

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో.. పడిపోయిన విద్యుత్తు డిమాండ్‌

  • మెరుగుపడిన గాలి నాణ్యత సూచీ

  • సంక్రాంతికి జనం ఊళ్లకు.. నగరం ఖాళీ

  • వరుస సెలవులు.. చలి కూడా కారణమే

హైదరాబాద్‌ సిటీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ వచ్చిందంటే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం సగానికి పైగా ఖాళీ అవుతుంది. పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారితో రోడ్లలో ట్రాఫిక్‌ కనిపించదు. అయితే.. ఈ సారి అనూహ్యంగా విద్యుత్తు డిమాండ్‌ తగ్గిపోయి.. గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) మెరుగుపడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సాధారణంగా రోజుకు 62-65 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉంటుంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఆ డిమాండ్‌ 15-18ు తగ్గి.. 47-50 మిలియన్‌ యూనిట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. సైబర్‌సిటీ, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌, హబ్సిగూడ సర్కిళ్లలో విద్యుత్తు డిమాండ్‌ భారీగా తగ్గిందని, మరో రెండుమూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వినియోగం తగ్గడానికి చలి కూడా ఓ కారణమని పేర్కొన్నారు. మరో రెండ్రోజులపాటు ఉదయం వేళల్లో పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు నగరంలో గాలి నాణ్యత సూచీ మెరుగుపడింది.


పీఎం10(సూక్ష్మధూళి) కణాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో.. పీల్చే గాలిలో నాణ్యత మెరుగుపడిందని.. ఈ పరిస్థితి ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, చిన్నారులకు ఉపశమనం కలిగిస్తుందని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు వివరించారు. పీఎం10 కణాలు 115 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తెలిపారు. కొంపల్లితోపాటు.. సనత్‌నగర్‌, నాచారం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఏక్యూఐ 58గా ఉండడం గమనార్హం..! పీఎం10 విలువలు హెచ్‌సీయూ వద్ద 63, సోమాజిగూడలో 74, ఈసీఐఎల్‌/కాప్రా వద్ద 90 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు వెల్లడించారు. నగరవాసులు ఊళ్లకు వెళ్లడం, విద్యాసంస్థలు, పరిశ్రమలకు సంక్రాంతి సందర్భంగా సెలవులివ్వడం, వాహనాల రద్దీ తగ్గడం వంటి కారణాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గాలి నాణ్యత పెరిగినట్లు పేర్కొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 04:09 AM