SBI Report: 1% అక్షరాస్యత పెరిగితే.. మహిళా ఓటింగ్ 25% పెరుగుదల..!
ABN, Publish Date - Jan 14 , 2025 | 04:07 AM
భారతదేశంలో అక్షరాస్యత, మహిళల ఓటింగ్ శాతానికి మధ్య గణనీయమైన సంబంధం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది.
వారి భాగస్వామ్యాన్ని పెంచాలి: ఎస్బీఐ నివేదిక
న్యూఢిల్లీ, జనవరి 13: భారతదేశంలో అక్షరాస్యత, మహిళల ఓటింగ్ శాతానికి మధ్య గణనీయమైన సంబంధం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. దేశంలో 1 శాతం అక్షరాస్యత పెరిగితే, అది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే మహిళల సంఖ్యలో 25 శాతం పెరుగుదలకు దారితీస్తుందని విశ్లేషించింది. ఈ సందర్భంగా గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో పెరిగిన మహిళా ఓటర్ల సంఖ్యను ప్రస్తావించింది.
2019తో పోలిస్తే.. 2024 ఎన్నికల్లో 1.8 కోట్ల మంది మహిళా ఓటర్లు పెరిగాయని తెలిపింది. ఇందులో ఇందులో 45 లక్షల మంది పెరుగుదలకు అక్షరాస్యత స్థాయి మెరుగుదలే కారణమని పేర్కొంది. మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుదలను నడిపించడంలో అక్షరాస్యత, ఉపాధి, మౌలిక సదుపాయాలు, ఇంటి యాజమాన్యం (ప్రధాన మంత్రి అవాస్ యోజన) వంటివి కీలక పాత్ర పోషిస్తాయని ఎస్బీఐ నివేదిక నొక్కిచెప్పింది.
Updated Date - Jan 14 , 2025 | 04:07 AM