Seethakka: గురుకులాల భోజనం అమ్మ వంటను గుర్తుచేయాలి

ABN, Publish Date - Jan 17 , 2025 | 04:07 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క చెప్పారు.

Seethakka: గురుకులాల భోజనం అమ్మ వంటను గుర్తుచేయాలి
  • విద్యకు తొలి ప్రాధాన్యం: మంత్రి సీతక్క

దిల్‌సుఖ్‌నగర్‌, జనవరి16(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని తెలంగాణ సంక్షేమ రెసిడెన్సియల్‌ గురుకుల విద్యాలయంలో గురువారం నిర్వహించిన సంక్షేమ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గురుకులాల్లో పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.


కొందరి రాజకీయ స్వార్థానికి ఉపాఽధ్యాయలు సమిధలుగా మారవద్దని సూచించారు. గురుకులాల వసతి గృహాల్లో అందిస్తున్న భోజనం అమ్మ చేతి వంటను గుర్తుకు చేసేలా ఉండాలన్నారు. కలుషిత ఆహార ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 04:07 AM