Urkonda Rape Incident: ఐదేళ్లుగా ‘ఊర్కొండపేట’ నిందితుల ఆగడాలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:21 AM
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో వివాహితపై సామూహిక లైంగికదాడి ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టగా, ఐదేళ్లుగా ఆలయాలు మరియు భక్తులను లక్ష్యంగా చేసుకుని నిందితులు లైంగిక దాడులు, బ్లాక్‌మెయిలింగ్ వంటి పథకాలతో తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారం ఆలయ సూత్రధారి మహేశ్ గౌడ్‌తో నడుస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితురాలి కేకలు దాచడానికి నిందితులు దారుణంగా ముట్టుకొన్నారు.

భక్తులను బెదిరించి డబ్బు వసూళ్లు
లైంగిక దాడి ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ : ఐజీ సత్యనారాయణ
నాగర్‌కర్నూల్/ ఊర్కొండ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో వివాహితపై సామూహిక లైంగికదాడి ఘటనతో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుల ముఠా ఐదేళ్లుగా ఊర్కొండపేటతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆలయాలకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని ఆగడాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సూత్రధారి ఊర్కొండపేట ఆలయంలో దినసరి వేతనంపై పనిచేస్తున్న మహేశ్ గౌడ్ ప్రధాన సూత్రధారి అని తేల్చారు. బాధితురాలి కేకలు వేయకుండా నోట్లో చేతి రుమాలు కుక్కి.. చేతులు వెనక్కి విరిచి కట్టి నిందితులు దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాగా, లైంగికదాడి ఘటన తర్వాత వస్తున్న పలు ఫిర్యాదులపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులే నిశ్చేష్టులవుతున్నారు. 400 ఏళ్ల చరిత్ర గల ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి తెలుగు రాష్ర్టాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. అలా గుడికి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసేవారని విమర్శలు ఉన్నాయి. కొందరి సెల్‌ఫోన్లు లాక్కుని బెదిరించడంతో ఎవరికీ చెప్పుకోలేక బాధితులు జేబులు ఖాళీ చేసుకుని వెళ్లిపోయేవారని తెలుస్తోంది. కాగా, వివాహితపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ ద్వారా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. వివాహితపై లైంగిక దాడి జరిగిన స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. తర్వాత ఐజీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శనివారం అర్ధరాత్రి పోలీసులు అప్రమత్తమై ఘటనాస్థలికి చేరుకుని అన్ని ఆధారాలు సేకరించారని చెప్పారు. అక్కడ లభించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా లోతైన దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: సీతక్క
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో మహిళపై లైంగికదాడి ఘటనలో నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క పోలీసు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆమె మంగళవారం మహిళా భద్రతా విభాగం డీజీ శిఖాగోయల్, మహిళాశిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు ప్రభుత్వ ఆధీనంలోని సఖి కేంద్రం సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News