ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ABN, Publish Date - Jan 16 , 2025 | 04:19 AM

రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ ప్రాంతంలో ఓ జంట దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు పుప్పాలగూడ పద్మనాభ స్వామి ఆలయం గుట్టపై ఓ వివాహిత, మరో యువకుడిని కిరాతకంగా చంపేశారు.

  • ఆలయ గుట్టపై వివాహిత, ఓ యువకుడి దారుణ హత్య

  • కత్తితో పొడిచి, తలపై బండరాళ్లతో మోది కిరాతకం

  • వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

  • రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

నార్సింగ్‌/వనస్థలిపురం/రాయదుర్గం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ ప్రాంతంలో ఓ జంట దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు పుప్పాలగూడ పద్మనాభ స్వామి ఆలయం గుట్టపై ఓ వివాహిత, మరో యువకుడిని కిరాతకంగా చంపేశారు. కత్తితో పొడిచి, తలపై బండరాయితో మోది ప్రాణాలు తీశారు. సంక్రాంతి రోజున గాలి పటాలు ఎగరేసేందుకు గుట్ట మీదకు వచ్చిన స్థానికులు మృతదేహాలను చూడడంతో ఈ దారుణం వెలుగు చూసింది. వనస్థలిపురానికి చెందిన బిందు(30), నానక్‌రాంగూడకు చెందిన అంకిత్‌ సాకేత్‌(25)ను మృతులుగా గుర్తించిన పోలీసులు వివాహేతర సంబంధమే హత్యలకు కారణమని అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన బిందు.. తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి వనస్థలిపురంలో నివాసముండేది. బిందు ఓ ఐటీ కంపెనీలో చిన్న ఉద్యోగి కాగా ఆమె భర్త కూలి పనులకు వెళుతుంటారు.


ఇక, మధ్యప్రదేశ్‌కు చెందిన సాకేత్‌ నానక్‌రాంగూడాలో నివాసముంటూ ఓ ఐటీ కంపెనీ హౌస్‌ కీపింగ్‌ విభాగంలో పని చేసేవాడు. ఈ క్రమంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే, జనవరి 3న ఇంటి నుంచి వెళ్లిన బిందు తిరిగి రాలేదు. దీనిపై బిందు భర్త జనవరి 4న వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, 11వ తేదీ నుంచి సాకేత్‌ కనిపించడం లేదని అతని కుటుంబసభ్యులు 12వ తేదీన గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పుప్పాలగూడ పద్మనాభ స్వామి ఆలయ గుట్టపై వీరిద్దరూ మృతదేహాలై కనిపించారు. ఎవరో వీరిని కత్తితో పొడిచి తలపై బండరాయితో మోది హత్య చేశారు. బిందు శరీరంపై సగం దుస్తులు మాత్రమే ఉండడంతో హత్యాచారం జరిగిందనే అనుమానం ఉంది. ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతుల వివరాలను సేకరించారు. బిందు, సాకేత్‌ కలిసి ద్విచక్రవాహనంపై ఘటనాస్థలికి వచ్చిన దృశ్యాలను సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. బిందుకు మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం ఉందని విచారణలో తెలియడంతో .. ఆ వ్యక్తి ఏమైనా దారుణానికి పాల్పడ్డాడా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 04:19 AM