Share News

రైళ్ల వేళల్లో మార్పులు

ABN , Publish Date - Jan 01 , 2025 | 04:25 AM

కొత్త రైల్వే టైమ్‌ టేబుల్‌ బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం దక్షిణ మధ్య రైల్వేతో పాటు దేశవ్యాప్తంగా పలు రైళ్ల వేళలు మారాయి.

రైళ్ల వేళల్లో మార్పులు

అమల్లోకి కొత్త రైల్వే టైమ్‌ టేబుల్‌.. ఎంఎంటీఎస్‌ వేళలూ మారుతున్నాయి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కొత్త రైల్వే టైమ్‌ టేబుల్‌ బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం దక్షిణ మధ్య రైల్వేతో పాటు దేశవ్యాప్తంగా పలు రైళ్ల వేళలు మారాయి. ఈ వివరాల కోసం ఐఆర్‌సీటీసీ, ఎన్‌టీఈఎ్‌స వెబ్‌సైట్లను సందర్శించాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు ముందుగా తాము ఎక్కవలసిన రైలు వేళలు మారాయో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవాలన్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇక నుంచి 15 నిమిషాలు ముందుగా ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. జంట నగరాల్లో తిరిగే ఎంఎంటీఎస్‌ సర్వీసుల వేళల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. సర్వీసులను విస్తరించడ ం వల్ల, వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సల రాకపోకలకు అనుగుణంగా, ప్రయాణికుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు వివరించారు. తమ డిమాండ్లను దక్షిణ మధ్య రైల్వే దృష్టిలో ఉంచుకుని ఎంఎంటీఎస్‌ సర్వీసుల వేళల్లో మార్పులు చేయడంపై ప్రయాణికుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి వేళలు మారిన ప్రధాన రైళ్ల వివరాలు

కాచిగూడ స్టేషన్‌ మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. యశ్వంత్‌పూర్‌-కోయంబత్తూర్‌, యశ్వంత్‌పూర్‌-కోర్బా, నిజాముద్దీన్‌-కోయంబత్తూర్‌, యశ్వంత్‌పూర్‌ -నిజాముద్దీన్‌, తిరుపతి-నిజాముద్దీన్‌, తిరుపతి-సికింద్రాబాద్‌, అమరావతి-తిరుపతి, తిరుపతి-అమరావతి, మహబూబ్‌నగర్‌- విశాఖపట్నం, మైసూర్‌-జైపూర్‌, జైపూర్‌-మైసూర్‌, చెన్నై-నాగర్‌సోల్‌, యశ్వంత్‌పూర్‌-గోరఖ్‌పూర్‌, రామేశ్వరం-ఓకా, నర్సపూర్‌-నాగర్‌సోల్‌, యశ్వంతపూర్‌-అంబేడ్కర్‌ నగర్‌, కర్నూల్‌-జైపూర్‌, యశ్వంతపూర్‌-కాచిగూడ, కాచిగూడ-యశ్వంతపూర్‌, యశ్వంతపూర్‌-లక్నో. ఫసికింద్రాబాద్‌ స్టేషన్‌.. వాస్కోడగామా-హైదరాబాద్‌, హైదరాబాద్‌-వాస్కోడగామా, పూణె-సికింద్రాబాద్‌. ఫనాంపల్లి స్టేషన్‌... హైదరాబాద్‌-ముంబై, ముంబై- హైదరాబాద్‌, విజయపుర-హైదరాబాద్‌, హుబ్లీ-హైదరాబాద్‌, ఫలింగంపల్లి స్టేషన్‌... కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-లింగంపల్లి.

Updated Date - Jan 01 , 2025 | 04:26 AM