అర్హులందరికీ సన్నబియ్యం అందేలా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:15 PM
అర్హులైన ప్రతీ ఒక్కరికి సన్న బి య్యం అందేలా చర్యలు తీసుకోవాలని రా ష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 4 (ఆంధ్ర జ్యోతి) : అర్హులైన ప్రతీ ఒక్కరికి సన్న బి య్యం అందేలా చర్యలు తీసుకోవాలని రా ష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి వీడియోకా న్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో స మావేశం నిర్వహించారు. మంత్రి మాట్లా డుతూ సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగించాలని, ప్రతి లబ్ధి దారులకు రేషన్ షాపుల ద్వారా ఉచితం గా ఒక్కరికి 6 కిలోల బియ్యం పంపిణీ చే యాలన్నారు. సన్నబియ్యం రవాణాకు సం బంధించి అదనపు లారీలను సమకూర్చు కోవాలని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యే లు, జిల్లా అధికారులు, ప్రతినిధులు లబ్ధి దారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని లబ్ధిదారులతో కలిసి స్వీకరించాలని, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. కలె క్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లా లోని రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు, మేనేజర్ శ్రీకళ, అధి కారులు పాల్గొన్నారు.