Self Employment Scheme: తెలంగాణ ప్రభుత్వ బంపర్ ఆఫర్.. అప్లై చేసుకుంటే 4 లక్షలు మీవే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 07:14 PM
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ఓ అద్భుతమైన పథకం తీసుకువచ్చింది. ఈ పథకం కింద 5 లక్షల మందికి రూ. 6 వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనుంది.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సెల్ఫ్ ఎంప్లయ్‌మెంట్ స్కీమ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాజీవ్ యువ వికాసమ్ స్కీమ్ కింద అర్హులైన వారికి 4 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. లోన్ అమౌంట్‌ను బట్టి 60 నుంచి 80 శాతం వరకు సబ్సీడీ వస్తుంది. ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 5 లక్షల మంది నిరుద్యోగులు లబ్ధిపొందనున్నారు. ఈ స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు చేసుకోవడానికి ఏఏ డాక్యమెంట్లు కావాలి?.. సబ్సీడీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
మొదటగా https://tgobmms.cgg.gov.in.లోకి వెళ్లాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఉపయోగించి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ వ్యక్తిగత, చదువు, ఉపాధికి సంబంధించిన వివరాలను అందించాలి. అనంతరం అవసరమైన డాక్యమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తవగానే.. అది రివ్యూలోకి వెళుతుంది. రివ్యూ పూర్తయి..మీరు అర్హులని తేలితే ఏప్రిల్ 5వ తేదీలోగా మీ దరఖాస్తు ఫైనలైజ్ అవుతుంది. మరింత సమాచారం కోసం జిల్లా బీసీ వెల్‌ఫేర్ అధికారికి కాల్ చేసి కొనుక్కోవచ్చు. హెల్ప్‌లైన్ నెంబర్ 040-12345678కి ఫోన్ చేయవచ్చు.
ఏ డాక్యుమెంట్లు కావాలి..
1) ఆధార్ కార్డు
2) తెలంగాణ డొమిసిల్ సర్టిఫికేట్
3) క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్స్
4) బ్యాంకు అకౌంట్ వివరాలు
5) రేషన్ కార్డు
6) ఎంప్లమ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ రిజిస్ట్రేషన్
లోన్ సబ్సీడీ వివరాలు..
రాజీవ్ యువ వికాసమ్ స్కీమ్ కింద లోన్ తీసుకున్న వారికి సబ్సీడీ కూడా వస్తుంది. తీసుకున్న అమౌంట్‌ను బట్టి సబ్సీడీ పర్సెంటేజ్ ఉంటుంది. 60 శాతం నుంచి 80 శాతం వరకు సబ్సీడీ వస్తుంది. మీరు లక్ష రూపాయల లోపు తీసుకుంటే 80 శాతం సబ్సీడీ పోతుంది. మిగిలిన అమౌంట్ మీరు కట్టుకోవాలి. లక్ష నుంచి రెండు లక్షల వరకు లోన్ తీసుకుంటే.. 70 శాతం సబ్సీడీ వస్తుంది. మిగిలిన 30 శాతం మీరే కట్టు కోవాలి. నాలుగు లక్షల వరకు లోన తీసుకుంటే 60 శాతం సబ్సీడీ వస్తుంది. మిగిలిన 40 శాతం మీరే కట్టుకోవాలి. ఉదాహరణకు మీరు ఈ స్కీమ్ కింద 3 లక్షలు లోన్ తీసుకుంటే ప్రభుత్వం 1.8 లక్షలు సబ్సీడీ కింద తీసేస్తుంది. మిగిలిన 1.2 లక్షలు మీరు కట్టుకోవాలి.
ఇవి కూడా చదవండి...
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
12వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్
For Telangana News And Telugu News