Share News

Rythu Bharosa: రైతుల ఖాతాల్లో నగదు జమ.. డేట్ ఫిక్స్..

ABN , Publish Date - Jan 02 , 2025 | 03:56 PM

Rythu Bharosa: రైతు భరోసా పంపిణీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పథకం అమలు విధి విధానాల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ.. గురువారం నాడు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయాలు..

Rythu Bharosa: రైతుల ఖాతాల్లో నగదు జమ.. డేట్ ఫిక్స్..
Rythu Bharosa Scheme

హైదరాబాద్, జనవరి 02: రైతు భరోసా పంపిణీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పథకం అమలు విధి విధానాల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ.. గురువారం నాడు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రివర్గ సభ్యులు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి.. ఎంతమేర భూమికి ఇవ్వాలి.. ఈ పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి జమ చేయాలి.. అనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.


మళ్లీ అప్లికేషన్స్..

క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించారు. అలాగే.. రైతు భరోసా కోసం రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఈ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. ఇక జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.


Also Read:

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవ తేదీ ఖరారు.. ఎప్పుడంటే..

మంత్రి దృష్టి పెడితే ఇలాగే ఉంటది రిజల్ట్

పాపం.. ఈమె భర్తను వెతికి పెట్టండి..

For More Telangana News and Telugu News..

Updated Date - Jan 02 , 2025 | 03:56 PM