Fatty Liver: ఫ్యాటీ లివర్‌పై సర్కారు ఫోకస్
ABN, Publish Date - Apr 05 , 2025 | 05:41 AM
రాష్ట్రంలో పెరిగిపోతున్న ఫ్యాటీ లివర్ కేసులపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టిసారించింది. ముఖ్యంగా మద్యపానం తీసుకోని వారిలో వచ్చే ఫ్యాటీ లివర్ కేసులు ప్రమాదకరంగా మారుతున్నాయి.

ఎన్‌ఎఎ్‌ఫఎల్‌డీ కేసులపై ప్రత్యేక దృష్టి
గుర్తింపు, చికిత్సా విధానాలపై పరిశీలన
ఏఐజీ ఆస్పత్రితో వైద్యశాఖ చర్చలు
50 వేల నుంచి లక్ష మందికి పరీక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరిగిపోతున్న ఫ్యాటీ లివర్ కేసులపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టిసారించింది. ముఖ్యంగా మద్యపానం తీసుకోని వారిలో వచ్చే ఫ్యాటీ లివర్ కేసులు ప్రమాదకరంగా మారుతున్నాయి. పైకి ఆరోగ్యంగా కనిపిస్తుండడంతో, చివరిదాకా వ్యాఽధిని గుర్తించక ప్రాణాలకు ప్రమాదంగా మారుతోంది. ఇలాంటి కేసుల్ని గుర్తించేందుకు ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసిజ్(ఎన్‌ఎఎ్‌ఫఎల్‌డీ)కేసుల గుర్తింపుకు ముందస్తు పరీక్షలు ఎలా చేస్తున్నారు? కేసుల ధోరణి, చికిత్సా విధానాలపై ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రి ఏఐజీ సలహాలు, సూచనలను తీసుకుంటోంది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్థు, ఆ శాఖ ఉన్నతాధికారులు ఏఐజీ ఆస్పత్రి వైద్యుల బృందంతో చర్చించారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో ఎన్‌ఎఎ్‌ఫఎల్‌డీ కేసుల్ని ఫైబ్రోస్కాన్ ద్వారా గుర్తిస్తున్నారు. ఈ విధానాన్నే ప్రభుత్వ దవాఖానాల్లోనూ అమలు చేయాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఎఎ్‌ఫఎల్‌డీ స్ర్కీనింగ్
రాష్ట్రంలో ఎన్‌ఎఎ్‌ఫఎల్‌డీ కేసుల స్థితిగతులను అంచనా వేసేందుకు ఏఐజీ ఆస్పత్రి రంగంలోకి దిగింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల నుంచి లక్ష మందికి ఎన్‌ఎఎ్‌ఫఎల్‌డీ పరీక్షలను చేయాలని నిర్ణయించింది. అందుకు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్ర్కీనింగ్ కేవలం మద్యపానం తీసుకోని వారికే ఉచితంగా చేయనున్నారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లోనూ చేపట్టనున్న ఈ పరీక్షలు 20 సంవత్సరాలు పైబడిన 60 ఏళ్లలోపు స్త్రీ, పురుషలకు మాత్రమే చేయనున్నారు. ఫైబ్రోస్కాన్ చేసిన ఐదు నిమిషాల్లోనే వ్యాధి నిర్ధారణ ఫలితాలు వెల్లడవుతాయి. ఏఐజీ ఆస్పత్రి చేసే ఈ స్ర్కీనింగ్ నివేదికను వైద్య ఆరోగ్యశాఖ తీసుకొని, దానిని విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆ నివేదిక ద్వారా రాష్ట్రంలో ఎన్‌ఎఎ్‌ఫఎల్‌డీ ఏ మేరకు ఉందో అంచనాకు రావొచ్చని అధికారులు అంటున్నారు.
Updated Date - Apr 05 , 2025 | 05:41 AM