Musi River: మూసీ ప్రాజెక్టుకు సహకరించండి..
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:51 AM
మూసీ నది పునరుజ్జీవ అభివృద్ధి ప్రాజెక్టుకు సహకారమందించాలని రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేశ్ మిట్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కోరారు.

రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శిని కోరిన రాష్ట్ర ఉన్నతాధికారులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): మూసీ నది పునరుజ్జీవ అభివృద్ధి ప్రాజెక్టుకు సహకారమందించాలని రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేశ్ మిట్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కోరారు. సోమవారం హైదరాబాద్‌కు రాకేశ్ మిట్టల్ వచ్చిన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని రక్షణ శాఖ కార్యాలయంలో మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు, హెచ్‌ఎండీఏ అధికారులు సమావేశమయ్యారు. మూసీనది ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి తగిన సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయన్ను కోరారు. కంటోన్మెంట్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ల పురోగతిపై సమీక్షించారు.
రక్షణశాఖ నుంచి అనుమతులు వచ్చినప్పటి నుంచి పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. మూసీ వెంట గోల్కొండ, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాలుండగా.. వాటిని తమకివ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ భూములకు బదులు మరో ప్రాంతంలో భూములిస్తామని తెలపగా.. ఇందుకు రక్షణ అధికారులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News