Nitin Gadkari: నేడు ఢిల్లీకి మంత్రి కోమటి రెడ్డి

ABN, Publish Date - Mar 11 , 2025 | 04:30 AM

తెలంగాణకు మంజూరు చేసిన రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పనుల్లో వేగం పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు.

Nitin Gadkari: నేడు ఢిల్లీకి మంత్రి కోమటి రెడ్డి
  • ఆర్‌ఆర్‌ఆర్‌ విషయమై కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు మంజూరు చేసిన రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పనుల్లో వేగం పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఉత్తరభాగం నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించినప్పటికీ కేంద్ర క్యాబినెట్‌లో ప్రాజెక్టు ఆమోదం పొందలేదని, త్వరితగతిన ఆమోదం తెలిపి, రహదారి నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరనున్నారు.


అదే విధంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే విస్తరణపై అధ్యయనం చేసేందుకు కేంద్రం డీపీఆర్‌ కన్సల్టెన్సీని నియమించిన నేపథ్యంలో ఆ రిపోర్టును త్వరితగతిన ఇచ్చేలా సంస్థకు సూచించే అంశంపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు.

Updated Date - Mar 11 , 2025 | 04:30 AM