Addanki Dayakar: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సర్కారు సిద్ధం

ABN, Publish Date - Mar 25 , 2025 | 03:46 AM

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేస్తుందని, త్వరలోనే ప్రభుత్వం జీవో తెస్తుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు.

Addanki Dayakar: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సర్కారు సిద్ధం
  • బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 9వ షెడ్యూల్‌లో చేర్చాలి: అద్దంకి

  • చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్‌ఉండాలి: కృష్ణయ్య

పంజాగుట్ట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేస్తుందని, త్వరలోనే ప్రభుత్వం జీవో తెస్తుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయానికి సీఎం రేవంత్‌రెడ్డికి కట్టుబడి ఉన్నారని, త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తారని తెలిపారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం రాహుల్‌ గాంధీ పోరాడుతున్నారన్నారు.


ప్రధాని మోదీ నిజమైన ఓబీసీ అయితే పార్లమెంటులో రిజర్వేషన్ల బిల్లును పెట్టి ఆమోదించి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. సోమవారం బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ సాధించాలని, పార్లమెంటులో బిల్లు పెట్టే దాకా పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు.

Updated Date - Mar 25 , 2025 | 03:46 AM