ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chanchalguda Jail: చంచల్‌గూడ సెంట్రల్‌ జైలు.. పర్యాటక కేంద్రం

ABN, Publish Date - Jan 12 , 2025 | 04:59 AM

జైలు అంటే తప్పు చేసిన వారిని చట్టపరిధిలో సంస్కరించి వారికి కొత్త జీవితం అందించే సంస్కరణ కేంద్రాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ సిద్ధమైంది.

  • సమరయోధుల వివరాలతో మ్యూజియం

  • రాజకీయ ఖైదీల జీవిత చరిత్ర వివరాలూ

  • పెయింటింగ్స్‌, వస్తువుల ప్రదర్శన

  • జైళ్లశాఖపై అవగాహన కల్పించే లక్ష్యం

హైదరాబాద్‌, జనవరి11(ఆంధ్రజ్యోతి): జైలు అంటే తప్పు చేసిన వారిని చట్టపరిధిలో సంస్కరించి వారికి కొత్త జీవితం అందించే సంస్కరణ కేంద్రాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ సిద్ధమైంది. అందులో భాగంగా చంచల్‌గూడ కేంద్ర కారాగారం సమీపంలో మ్యూజియం ఏర్పాటు చేసి పర్యాటక, విజ్ఞాన కేంద్రంగా మార్చనున్నారు. ప్రజలు, విద్యార్ధులు జైళ్ల గురించి స్వయంగా సందర్శించి తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇప్పటికే ట్రైబల్‌ మ్యూజియానికి విశేష ఆదరణ లభిస్తోంది. చట్టప్రకారం జైలు పరిసరాల్లో సాధారణ ప్రజలు వచ్చేందుకు ఎంత వరకు అనుమతి ఉంటుందో అక్కడి వరకు చిన్నపాటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి సందర్శకులను అనుమతించాలనే అంశాన్ని గతంలో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. గతంలో పరిశీలించిన ఉద్యానవనం విధానం పునఃపరీశీలించి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ‘‘త్వరలో జైలు మ్యూజియం ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. పెయింటింగ్స్‌, ఇతర పరికరాల్ని మ్యూజియంలో ఉంచి ప్రజలకు జైళ్ల శాఖ పనితీరును వివరించనున్నాం.’’ అని జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా తెలిపారు.


మ్యూజియంలో ఏముంటాయంటే?

మ్యూజియంలో రాజకీయ ఖైదీల జీవిత చరిత్ర, వారి త్యాగాలు భావితరాలకు తెలియజేసే విధంగా పెయింటింగ్స్‌, ఇతర వివరాలు పొందుపరుస్తారు. దేశస్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రముఖుల జీవితం, వారు ఉపయోగించిన వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. జైళ్ల శాఖ పనితీరు, ఖైదీలను ఎలా ఉంచుతారు, వారికి విధించే శిక్షలు, జైళ్ల శాఖలో ఉపయోగించే పరికరాలు, పాతకాలంలో జైళ్లలో అమలు చేసిన శిక్షలకు సంబంఽధించిన పెయింటింగ్స్‌, పరికరాల్ని మ్యూజియంలో ఉంచుతారు. పురాతన జైళ్లలో ఉపయోగించిన గంటలు, ప్రస్తుతం వాడుకలో లేని ఇతర పరికరాల్ని సందర్శకులు వీక్షించడంతోపాటు వాటి పనితీరును తెలుసుకోవచ్చు. నామమాత్రపు ప్రవేశ రుసుముతో సందర్శకుల్ని అనుమతించనున్నారు.


సంగారెడ్డిలో ఇప్పటికే ప్రయోగం

గతంలో సంగారెడ్డి పాత జైలులో మ్యూజియం ఏర్పాటు చేశారు. మ్యూజియంతోపాటు సందర్శకులు జైలు జీవితాన్ని అనుభూతి చెందేందుకు వీలుగా ‘‘ఫీల్‌ ద జైల్‌’’ విధానంతో లాకప్‌ గదుల్లో ఉంచి ఖైదీల తరహాలో ఆహారం అందించారు. 2016లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మ్యూజియం, ఫీల్‌ ద జైల్‌కు మొదట్లో బాగానే ఆదరణ లభించినా ఆ తర్వాత సందర్శకుల తాకిడి తగ్గింది. దీంతో కరోనాకు ముందు నుంచి సంగారెడ్డి పాత జైలు మ్యూజియం మూతపడింది.

Updated Date - Jan 12 , 2025 | 04:59 AM