ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

QR code: ఠాణాల్లో క్యూఆర్‌ కోడ్‌లు

ABN, Publish Date - Jan 13 , 2025 | 04:38 AM

పోలీసు సేవలపై ప్రజాభిప్రాయ సేకరణకు తెలంగాణ పోలీసు శాఖ సిద్ధమైంది.

  • ప్రజాభిప్రాయ సేకరణకు పోలీసు శాఖ సిద్ధం

  • పేట్‌బషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ప్రారంభం

పేట్‌బషీరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పోలీసు సేవలపై ప్రజాభిప్రాయ సేకరణకు తెలంగాణ పోలీసు శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా పోలీసు స్టేషన్లకు వచ్చిన ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేసేందుకు క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరించిన పోలీసు శాఖ.. ఆ సేవలను ప్రారంభించింది. క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్లను పోలీసు స్టేషన్లలో ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు.


ఇందులో భాగం గా హైదరాబాద్‌ పేట్‌బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఈ క్యూఆర్‌ కోడ్‌ సేవలను డీజీపీ ప్రారంభించారు. కాగా, ప్రజలు తమ మొబైల్‌ ఫోన్‌ సాయంతో ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి.. తద్వారా ఓపెన్‌ అయిన వెబ్‌ పేజీలో తమ వివరాలు నమోదు చేసి ఏ విషయంపై అభిప్రాయం తెలియజేయాలని అనుకుంటున్నారో దానిని ఎంపిక చేసుకోవాలి. ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌, ఈ చలాన్‌, పాస్‌పోర్టు ధ్రువీకరణ, ఇతర విషయాలు.. తదితర ఐదు అంశాలలో కావాల్సిన దానిని ఎంపిక చేసుకుని ఫిర్యాదులు, అభిప్రాయాలు, పొందిన సేవలపై రేటింగ్‌ ఇవ్వవచ్చు.

Updated Date - Jan 13 , 2025 | 04:38 AM