Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి రూ. 4 లక్షలు..
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:05 PM
న రాష్ట్ర ప్రభుత్వం.. ముందస్తు చర్యలు చేపట్టింది. హీట్‌వేవ్, సన్ స్ట్రోక్‌ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్‌గా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండనున్న నేపథ్యంలో కీలక ప్రకటన విడుదల చేసింది. 2025లో వడదెబ్బల తీవ్రత పెరగనున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ముందస్తు చర్యలు చేపట్టింది. హీట్‌వేవ్, సన్ స్ట్రోక్‌ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్‌గ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వడదెబ్బతో చనిపోయిన వారికి ఇక నుంచి ఎస్‌డీఆర్ఎఫ్ కింద అపద్బంధు పేరుతో ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటి ఆపద్బంధు పథకం కింద బాధిత వ్యక్తులకు రూ. 50,000 వేలు మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఈ పరిహారం భారీగా పెరుగనుంది.
Also Read:
దేశ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్
వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..
ఇక.. మరింత పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
For More Telangana News and Telugu News..