ACB: ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:28 AM
రాష్ట్రంలో మంగళవారం వేర్వేరు చోట్ల ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్..

లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన వైనం
జమ్మికుంట రూరల్/ మేళ్లచెర్వు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంగళవారం వేర్వేరు చోట్ల ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్.. పెద్దంపల్లికి చెందిన గ్రామైఖ్య సంఘం సహాయకురాలు స్వప్నకు ఏడాది వేతనం రూ.60 వేలు చెల్లించడానికి రూ.20 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనికరించాలని స్వప్న వేడుకున్నా ఆయన మనస్సు కరగక పోవడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం స్నప్న ఇస్తున్న రూ.10 వేల నగదు తీసుకుంటున్న సురే్‌షను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణపై గతేడాది అక్టోబర్ 23న నమోదైన కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఎస్‌ఐ అంతిరెడ్డి రూ.15 వేలు లంచం డిమాండ్ చేసి.. రూ.10 వేలకు ఒప్పందానికి వచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు నల్లగొండలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మంగళవారం రూ.10 వేల నగదు ఇస్తుండగా తీసుకుంటున్న ఎస్‌ఐ అంతిరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని మంగళ్‌హట్ పరిధిలో పాత విద్యుత్ మీటర్ స్థానంలో కొత్త మీటర్ ఇవ్వడంతోపాటు విద్యుత్ బిల్లుల బకాయిలు రద్దు చేసేందుకు ఉమర్ అనే వ్యక్తి వద్ద టీజీఎ్‌సపీడీసీఎల్ మంగళ్‌హట్ విద్యుత్ సెక్షన్ ఉద్యోగి అబ్దుల్ రహ్మాన్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. మంగళవారం సీతారాంపేటలోని మంగళ్‌హట్ కార్యాలయంలో ఉమర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటున్న అబ్దుల్ రహ్మాన్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.