ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ABN, Publish Date - Jan 16 , 2025 | 04:21 AM

రెండు రోజుల క్రితం ఖమ్మంలో జరిగిన యువకుడి అదృశ్యం ఘటన విషాదాంతమైంది. అతడి మృతదేహం మంగళవారం సాగర్‌ కాలువలో లభించింది.

  • ఖమ్మంలో అదృశ్యమైన యువకుడి మృతి

  • సాగర్‌ కాలువలో మృతదేహం లభ్యం

  • మృతదేహంతో రోడ్డుపై కుటుంబసభ్యుల ధర్నా

ఖమ్మం రూరల్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : రెండు రోజుల క్రితం ఖమ్మంలో జరిగిన యువకుడి అదృశ్యం ఘటన విషాదాంతమైంది. అతడి మృతదేహం మంగళవారం సాగర్‌ కాలువలో లభించింది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లి పరిధిలోని రాజీవ్‌ గృహకల్ప ప్రాంతానికి చెందిన పందెపు హనుమంతరావు, మమత దంపతుల పెద్దకుమారుడు జ్ఞానసాయి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్త్తున్నాడు. వారి చిన్న కుమారుడు సంజయ్‌కుమార్‌(22) కూడా అన్న దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంజయ్‌ గత ఆదివారం ఖమ్మం వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున అతడి అన్న కూడా వస్తుండడంతో తీసుకువచ్చేందుకు ఖమ్మం బస్టాండ్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బైక్‌పై బయటికి వెళ్లాడు. కొంతసేపటి తరువాత తనను ఓ ఆటో ఢీకొట్టిందని తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. మరికొంత సమయానికి సాగర్‌ కాల్వకట్టపై ఆటోలో ఓ యువతిని చంపారని, తనను కూడా చంపుతున్నారని తన అన్న ఫోన్‌కు వాయిస్‌ మెసేజ్‌ పంపించాడు.


ఆ తరువాత అతడి ఫోన్‌ స్విచాఫ్‌ అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు, కాలనీ యువకులు మున్నేరు, సాగర్‌ కాలువ కట్టపైకి వెళ్లి గాలించగా అతడి బైక్‌ కనిపించింది. అతడు మాత్రం కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అతడి మృతదేహం మంగళవారం సాయంత్రం కొణిజర్ల మండలం తనికెళ్ల పరిధిలోని సాగర్‌ కాల్వ లాకుల వద్ద లభ్యమైంది. తమ కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని, న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సంజయ్‌ కుటుంబసభ్యులు, కాలనీ వాసులు ఖమ్మం-వరంగల్‌ ప్రధాన రహదారిపై మృతదేహంతో ధర్నా నిర్వహించారు. కాగా సంజయ్‌ తన అన్న ఫోన్‌కు పంపించిన వాయిస్‌ మెసేజ్‌లో చెప్పినట్లుగా ఆటోలో యువతిని అపహరించినట్లుగాని, హత్య జరిగినట్లుగానీ ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 16 , 2025 | 04:21 AM