ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు కేకేఆర్ గౌతమ్ విద్యార్థి అర్హత
ABN, Publish Date - Mar 07 , 2025 | 03:57 AM
ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్ ట్రైనింగ్ క్యాంప్‌కు తమ విద్యార్థి ఉజ్వల్ రామ్ అర్హత సాధించాడని కృష్ణ జిల్లా గుడివాడలోని కేకేఆర్ గౌతమ్ హైస్కూల్ గురువారం తెలిపింది.

హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్ ట్రైనింగ్ క్యాంప్‌కు తమ విద్యార్థి ఉజ్వల్ రామ్ అర్హత సాధించాడని కృష్ణ జిల్లా గుడివాడలోని కేకేఆర్ గౌతమ్ హైస్కూల్ గురువారం తెలిపింది. ఈ క్యాంప్ మే 8 నుంచి 31 వరకు చెన్నైలో జరగనుందని వెల్లడించింది. ఇటీవల హోమిబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ఉజ్వల్ రామ్ అత్యంత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సత్యారామ్ తెలిపారు. జాతీయ పోటీలకు దేశవ్యాప్తంగా 69 మంది ఎంపికవగా, ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం తమ విద్యార్థి మాత్రమే ఉన్నాడని ఆయన చెప్పారు.
Updated Date - Mar 07 , 2025 | 03:57 AM