Share News

Weather Updates: అకాల.. కలవరం

ABN , Publish Date - Apr 15 , 2025 | 05:15 AM

చైత్రం ప్రారంభంలోనే మాడుపగిలే ఎండలు కాస్తున్నాయి. ఇదే సమయంలో నిమిషాల వ్యవధిలో కారుమబ్బులు కమ్ముకుని ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములు పిడుగులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది.

Weather Updates: అకాల.. కలవరం
Climate Change

  • అనూహ్యంగా మారుతున్న వాతావరణం..

  • మండే ఎండలు.. పిడుగుల వాన.. తీవ్రంగా నష్టపోతున్న రైతులు

  • నౌకాస్టుతో అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాఖ యత్నం

  • గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో మార్చిలోనే మే నెల స్థాయిలో ఎండలు

  • వచ్చే నెలలో 50 డిగ్రీలు నమోదుకావచ్చని అంచనాలు

(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి): చైత్రం ప్రారంభంలోనే మాడుపగిలే ఎండలు కాస్తున్నాయి. ఇదే సమయంలో నిమిషాల వ్యవధిలో కారుమబ్బులు కమ్ముకుని ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములు పిడుగులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. ఆరుబయట ప్రధానంగా పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువులు, కాపరులు పిడుగులకు మృత్యువాత పడుతున్నారు. అనూహ్యంగా మారిపోతున్న వాతావరణతో పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. అసాధారణ వాతావరణ మార్పులపై అందుబాటులోకి వచ్చిన ‘నౌకాస్టు’ విధానంలో హెచ్చరికలు జారీచేస్తున్నా ఉపశమనం లభించడం లేదు. సాధారణంగా మే నెలలో ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని ఈదురుగాలులు వీస్తుంటాయి. పిడుగులుతో వడగళ్ల వానలు కురుస్తుంటాయి. అటువంటిది గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే అసాధారణంగా ఎండలు పెరిగి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెలలో దేశంలో అనేకచోట్ల 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే తీవ్రత రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. వచ్చే నెలలో కొన్నిచోట్ల 50 డిగ్రీల మార్కుకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెలలో కురిసే అకాల వర్షాలు మరింత కలవరపెడతాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యుడు ఓఎ్‌సఆర్‌యూ భానుకుమార్‌ హెచ్చరించారు.


క్యుములోనింబస్‌ మేఘాలు, పిడుగులు..

వేసవి తీవ్రత పెరిగేకొద్దీ పొడిగాలి, తడిగాలి (తేమతో ఉండేది) ఒకచోట కలుస్తాయి. పొడిగాలి ఒత్తిడితో తడిగాలి పైకి లేచి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడతాయి. భూఉపరితలం నుంచి మేఘాలు పైకి వెళ్లే కొద్దీ దాంట్లో ఉష్ణోగ్రతలు తగ్గి.. ఆరు కిలోమీటర్లు దాటిన తరువాత మైనస్‌ డిగ్రీలు ఉంటుంది. దీంతో మేఘాల్లో మంచు గడ్డలు ఏర్పడతాయి. అలా 12 నుంచి 13 కిలోమీటర్లు ఎత్తు వరకు మేఘాల్లో మైనస్‌ 80 డిగ్రీలు ఉంటుంది. ఆరు కిలోమీటర్లు దాటిన తరువాత మంచు గడ్డల వల్ల మేఘాల బరువు పెరిగి, 12 నుంచి 13 కి.మీ.కు వెళ్లేసరికి బరువు భరించలేక ఆ మేఘాలు విచ్ఛన్నమవుతాయి. దీనినే క్లౌడ్‌ బరస్ట్‌ అంటారు. ఆ క్షణాల్లో ప్రచండ వేగంతో గాలులు వీస్తాయి. అప్పుడే కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు, ఉరుములు సంభవిస్తాయి. పిడుగులు పడతాయి. ఇదంతా ఐదు నిమిషాలకు అటుఇటుగా ముగిసి భారీ వర్షం ప్రారంభమవుతుంది పైనున్న మంచుగడ్డలు కింద పడేటప్పుడు కొన్ని కరిగిపోగా మిగిలినవి వడగళ్లుగా భూమిపై పడతాయి. మొత్తం ప్రక్రియ గంటలోపే ముగుస్తోంది. క్యుములోనింబస్‌ మేఘాలు ఉధృతంగా ఉన్నప్పుడు ప్రజలు ఆరుబయట సంచరించవద్దని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు

Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 09:01 AM