Warangal: వరంగల్‌ చపాట మిర్చికి జీఐ ట్యాగ్‌

ABN, Publish Date - Apr 03 , 2025 | 03:51 AM

వరంగల్‌ చపాట రకం మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ సర్టిఫికెట్‌ జారీ అయింది. దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలోని తిమ్మంపేట చిల్లీ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ పేర కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీకి ఈ సర్టిఫికెట్‌ను అందించారు.

Warangal: వరంగల్‌ చపాట మిర్చికి జీఐ ట్యాగ్‌

హైదరాబాద్‌, హనుమకొండ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ చపాట రకం మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ సర్టిఫికెట్‌ జారీ అయింది. దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలోని తిమ్మంపేట చిల్లీ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ పేర కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీకి ఈ సర్టిఫికెట్‌ను అందించారు. ఈమేరకు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ దండా రాజిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది తెలంగాణలో నమోదైన 18వ భౌగోళిక గుర్తింపు అని, అలాగే జీఐ ట్యాగ్‌ పొందిన తొలి ఉద్యాన పంట చపాటా మిర్చియేనని పేర్కొన్నారు.


వరంగల్‌, హనుమకొండ, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ తదితర జిల్లాల్లో రైతులు ప్రత్యేకంగా సాగుచేసే ఈ మిర్చిని స్థానికులు టమోటా మిరపకాయ అని పిలుస్తారన్నారు. 80 ఏళ్లుగా ఈ వెరైటీ మిర్చి సాగులో ఉందని, జీఐ వచ్చిన నేపథ్యంలో వరంగల్‌ రైతులు కిలోకు రూ.300 నుంచి రూ.500 వరకు అమ్ముకోవచ్చని తెలిపారు. జీఐ ట్యాగ్‌ వల్ల భవిష్యత్తులో చపాట మిర్చికి మంచి ధర లభించడమే కాకుండాఅంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌కు అవకాశం లభిస్తుంది.

Updated Date - Apr 03 , 2025 | 03:51 AM