Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:10 PM
Errabelli Dayakar Rao: రెేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పలు నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు.

మహబూబాబాద్, ఏప్రిల్ 15: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని.. ప్రసంగించారు.
సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల జరపాలని ఆయన సవాల్ విసిరారు. ఈ స్థానిక సంస్థ ఎన్నికలు జరపడానికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. వాటిలో కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా ఉన్నాయని వివరించారు. మిగత చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని ఆయన జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే.. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
మరోవైపు 2023, ఏడాది చివరిల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. అయితే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ కాస్తా ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడిచినా నేటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడం లేదని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అలాంటి వేళ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే.. తాము గెలుస్తామని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఇంకోవైపు కేబినెట్ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ పార్టీ అధిష్టానంతో పలు దఫాలుగా చర్చించింది. దీంతో మరికొద్ది రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహగానాలు గాంధీ భవన్‌లో ఊపందుకొన్నాయి.
కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడనే విషయంపై మాత్రం ఆ పార్టీలోని కీలక నేతలకు సైతం నేటికి ఒక స్పష్టత అయితే అనేది లేదనే ఓ చర్చ సైతం సాగుతోన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే.. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టమవుతోందని వారు భావిస్తున్నట్లు ఎర్రబెల్లి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోందనే ఓ వాదన అయితే సర్వత్ర వినిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
For Telangana News And Telugu News