Share News

ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:03 AM

విద్యార్థులు ప్రశ్నించే తత్త్వాన్ని అలవ ర్చుకోవాలని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలి

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి

మాట్లాడుతున్న శ్రీనివాస్‌రెడ్డి

నల్లగొండ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ప్రశ్నించే తత్త్వాన్ని అలవ ర్చుకోవాలని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘21వ శతాబ్ధంలో సామాజిక న్యాయ పునఃపరిశీలన’ అనే అంశంపై మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయంలో ఆదివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ మౌలిక లక్షణమైన స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం సాధనకు మహానీయుల భావజాలాన్ని పోరాట మార్గంలో స్ఫూర్తిని పొందాలన్నారు. సమాజంలో అనేక అపసవ్య ధోరణు ఉన్నాయని, మౌనంగా కాక ప్రశ్నలుగా ముందుకు రావాలని కోరారు. దక్షత, బాధ్యతతో జవాబుదారితనంతో పాలన అందించే ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో విద్యావంతుల పాత్ర కీలకమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన హక్కుదారులన్న సత్యాన్ని గ్రామగ్రామాన చేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంబేడ్కర్‌ స్ఫూర్తిగా అధ్యయన పోరాటాలు పరస్పర ప్రేరితాలుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరా బాద్‌ కేంద్రీయ విశ్వవి ద్యాలయం ఆచార్యులు వెంకటేష్‌, ఎంజీయూ ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, ప్రేమ్‌ సాగర్‌, అంజిరెడ్డి, శ్రీదేవి, అరుణప్రియ కల్యాణి, ప్రశాంతి, వెంకటంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 01:03 AM