ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అన్న కూతురిని ప్రేమించాడని.. వ్యక్తి ఇంటికి అగ్గి

ABN, Publish Date - Jan 16 , 2025 | 04:12 AM

తన అన్న కూతురిని ఓ యువకుడు ప్రేమిస్తుండటాన్ని సహించలేక సదరు యువతి చిన్నాన్న అతనిపై కసి పెంచుకున్నాడు. అతని కుటుంబ సభ్యులను హతమార్చాలనుకున్నాడు.

  • చిన్నాన్న దుర్మార్గం.. ప్రేమికుడి కన్నవారికి నిప్పు

  • తండ్రికి 50ు గాయాలు.. త్రుటిలో తప్పించుకున్న తల్లి

  • సమీపంలో ఆడుకుంటున్న ఓ చిన్నారికి అంటిన మంటలు

  • హైదరాబాద్‌ అల్వాల్‌లో ఘోరం.. పరారీలో నిందితుడు

అల్వాల్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): తన అన్న కూతురిని ఓ యువకుడు ప్రేమిస్తుండటాన్ని సహించలేక సదరు యువతి చిన్నాన్న అతనిపై కసి పెంచుకున్నాడు. అతని కుటుంబ సభ్యులను హతమార్చాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఆ యువకుడు నివసించే ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలపాలైన ఘటన హైదరాబాద్‌ అల్వాల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మచ్చబొల్లారం డివిజన్‌, గోపాల్‌నగర్‌ ఎరుకల బస్తీలో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ప్రదీప్‌ (25) తన తల్లిదండ్రులతో కలిసి గత 20 ఏళ్లుగా ఉంటున్నారు. గతంలో ప్రదీప్‌ తాను ప్రేమించే యువతి చిన్నాన్న వివేకానంద (40) బైక్‌ షోరూమ్‌లో పనిచేశాడు. ఈ క్రమంలో ప్రదీ్‌పకు వివేకానంద అన్న కూతురితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే దీనిని వివేకానంద సహించలేకపోయాడు. ఆమె జోలికి రావొద్దని ప్రదీ్‌పను పలుమార్లు హెచ్చరించాడు. అయినా ప్రదీప్‌ వైఖరిలో మార్పు రాకపోవడంతో వివేకానంద ఉక్రోషం పెంచుకున్నాడు.


ఈ నేపథ్యంలో ప్రదీప్‌ కుటుంబ సభ్యులను చంపాలనుకొని పథకం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో క్యాన్‌లో పెట్రోల్‌ తీసుకుని ప్రదీప్‌ ఇంటికి వివేకానంద వచ్చాడు. అప్పుడు ప్రదీప్‌ ఇంట్లో లేడు.. అతని తల్లి దండ్రులు ప్రకాష్‌, హేమలత ఉన్నారు. వివేకానంద తన వెంట తెచ్చిన పెట్రోల్‌ను వారిద్దరిపై చల్లాడు. అలాగే ఇంటి తలుపులపై వెదజల్లి నిప్పంటించడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రకాష్‌ శరీరమంతా మంటలంటుకున్నాయి. హేమలత మాత్రం త్రుటిలో మంటల నుంచి తప్పించుకుంది. మంటలు వ్యాపించడంతో ప్రకాష్‌ ఇంటికి సమీపంలో ఆరుబయట ఆడుకుంటున్న దిలీప్‌ అనే వ్యక్తి కూతురు చాందినీ (4)కి కూడా మంటలంటుకున్నాయి. పాప కాళ్లు, చేతులు, కడుపుభాగంలో మంటలు అంటుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రకా్‌షను స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించగా, చిన్నారి చాందినిని వారి కుటుంబ సభ్యులు కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 50శాతం గాయాలైన ప్రకాష్‌ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారి తల్లిదండ్రులు పేదవారు కావడంతో వారు వైద్యం చేయించడం కష్టంగా మారింది. గాయాలపాలైన పాప రోదిస్తుండటంతో తల్లిదండ్రులు చూడలేక విలవిల్లాడుతున్నారు. వారి ప్రేమ వ్యవహారం తమ పాపకు శాపంగా మారిందని బాధపడుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు వివేకానంద కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 04:12 AM