12వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ABN, Publish Date - Mar 17 , 2025 | 09:57 AM
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సభలో విజన్ 2047పై లఘు చర్చ జరుగనుంది.
అమరావతి, మార్చి 17: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) 12వ రోజుకు చేరుకున్నారు. ఈరోజు (సోమవారం) ఉదయం సభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు (AP Deputy Speaker Raghurama Krishna Raju) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పారిశ్రామిక వాడల అభివృద్ధి, నెల్లూరు జిల్లాలో పశు వైద్య కళాశాల, ఎన్‌ఆర్‌జీఎస్‌లో అవినీతి నిరోధించడం, సహకార కేంద్ర బ్యాంకుల్లో అవినీతి తదితర అంశాలపై శాసన సభలో ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి. అలాగే 2025 ఏపీ ఆయుర్వేద, హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ సవరణ బిల్లు సభ ముందుకు రానుంది. విజన్ 2047పై శాసన సభలో లఘు చర్చ జరుగనుంది.
ఇక ఏపీ శాసనమండలి సమావేశాలు కూడా 11వరోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు మండలి సమావేశాలు మొదలుకానున్నాయి. మండలిలోనూ ప్రశ్నోత్తరాలు జరుగనున్నాయి. 2025 భూమి హక్కు పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లు శాసనమండలి ముందుకు రానుంది. అలాగే ఉద్యోగుల సమస్యలుపై మండలిలో లఘు చర్చ జరుగనుంది.
ఇవి కూడా చదవండి...
NASA: ఇంటికొస్తున్న సునీతా విలియమ్స్.. వచ్చే టైం ప్రకటించిన నాసా
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
Read Latest AP News And Telugu News
Updated at - Mar 17 , 2025 | 10:28 AM