సత్తా చాటిన మహిళా ఎమ్మెల్యేలు .. అనిత మాటలతో దద్దరిల్లిన గ్రౌండ్

ABN, Publish Date - Mar 18 , 2025 | 07:07 PM

ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల స్పోర్ట్స్ మీట్ సందడిగా సాగింది. విజయవాడలోని ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఆటల పోటీల్లో మహిళ ఎమ్మెల్యేలు తమ సత్తా చాటారు. మూడు రోజుల పాటు ఈ ఆటల పోటీలు జరుగనున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ గేమ్స్ జరుగనున్నాయి.

విజయవాడ ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమాలను లాంఛనంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు షటిల్‌, త్రోబాల్‌, క్రికెట్, వాలీబాల్‌, బ్యాడ్మింటన్, క్యారమ్స్, కబడ్డీ, టెన్నిస్, టేబుల్‌ టెన్నిస్, టెన్నికాయిట్, టగ్‌ ఆఫ్‌ వార్, అథ్లెటిక్స్‌ (పరుగు పందెం, షాట్‌పుట్‌) పోటీలను ఏర్పాటు చేశారు. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వంద మీటర్ల పరుగు పందెం, షాట్‌పుట్, క్యారమ్స్, షటిల్‌ బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, టగ్‌ ఆఫ్‌ వార్‌ క్రీడలు ఉన్నాయి. కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ పోటీలకు దూరంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 07:41 PM