మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభణ
ABN, Publish Date - Mar 22 , 2025 | 04:29 PM
Nalgonda Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది. నల్గొండలో దాదాపు రెండు లక్షల కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.

నల్గొండ, మార్చి 22: జిల్లాలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం రేపుతోంది. గుండ్రంపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫాంలో రెండు లక్షల కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో డాక్టర్లు, సిబ్బంది అక్కడకు చేరుకుని ఫాంలో ఉన్న కోళ్లను చంపి పాతిపెట్టారు. ఇప్పటికే పదివేల నుంచి 20వేల కోళ్లు చనిపోయినట్లు జేడీ తెలిపారు. చనిపోయిన కోళ్లను, ఇప్పుడు చంపబోయే కోళ్లను పెద్ద గొయ్యి తీసి తవ్వి పూడ్చేస్తామని ఆయన చెప్పారు. జిల్లాలోని ప్రతీ కోళ్ల ఫారాన్ని తమ సిబ్బంది తనిఖీ చేసి కోళ్లకు టెస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో పాజిటివ్ వచ్చిన కోళ్లను ఆ ఫాంలో ఉన్న కోళ్లను గొయ్యిలో వేసి పూడ్చేస్తామని జేడీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Jagan Sharmila On Delimitation: పునర్విభజనపై జగన్, షర్మిల ఏమన్నారంటే
ఆ రేసులో నేను లేను.. తేల్చిచెప్పేసిన బండి సంజయ్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 22 , 2025 | 04:29 PM