CM Revanth Reddy: సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ.. కీలక అంశాలపై చర్చ..!

ABN, Publish Date - Apr 15 , 2025 | 11:00 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎల్పీ సమావేశం జరుగనుంది. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీవర్గీకరణతో సహా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ(మంగళవారం) సీఎల్పీ సమావేశం జరుగనుంది. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీవర్గీకరణతో సహా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటిదాక నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల నిర్వహించిన కార్యక్రమాల గురించి సీఎం రేవంత్‌రెడ్డి తెలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులను కూడా తట్టుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామనే విషయాలను ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నారో ఎమ్మెల్యేలను అడిగి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుసుకోనున్నారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసంఈ ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి

Narendra Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు

KTR: ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!

Kishan Reddy: అంబేడ్కర్‌ను అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ది

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 15 , 2025 | 11:08 AM